Main Menu

Adugare Yeesuddi Atanine Chelulaala (అడుగరే యీసుద్ది అతనినే చెలులాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 429 | Keerthana 170 , Volume 12

Pallavi: Adugare Yeesuddi Atanine Chelulaala (అడుగరే యీసుద్ది అతనినే చెలులాల)
ARO: Pending
AVA: Pending

Ragam: Manoharam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యీ సుద్ది ఆతనినే చెలులాల
చిడిముడిఁ జెప్పినట్టు సేసేఁ గాని        ॥ పల్లవి ॥

కొత్త కొత్త విన్నపాలు కోరి వేఁడిఁ జేయఁగాను
చిత్త మెట్టుండునొకా చెలువునికి
బత్తి తోడ సారె సారెఁ బాదాలు విసుకఁగాను
తత్తరపు గోళ్ళేడఁదాకునో తనకు        ॥ అడుగ ॥

యెగ్గెఱఁగక సేవనే నిందరిలోఁ జేయఁగాను
సిగ్గులెంత నిండునొకా చేరి పతికి
వొగ్గి యే పొద్దునుఁ దనవొద్దఁ గాచుకుండఁగాను
వెగ్గళించరాక యెంత వేసటొకొ తనకు     ॥ అడుగ ॥

గట్టి నా గుబ్బల నొత్తి కరఁగించఁగాను పంత
మెట్టొకా శ్రీ వేంకటేశ్వరునికి
యిట్టే తా నన్నుఁగూడె యింకా నేఁగొసరఁగా
రెట్టించి తమకములు రేఁగునొకా తనకు    ॥ అడుగ ॥

Pallavi

Aḍugarē yī suddi ātaninē celulāla
ciḍimuḍim̐ jeppinaṭṭu sēsēm̐ gāni

Charanams

1.Kotta kotta vinnapālu kōri vēm̐ḍim̐ jēyam̐gānu
citta meṭṭuṇḍunokā celuvuniki
batti tōḍa sāre sārem̐ bādālu visukam̐gānu
tattarapu gōḷḷēḍam̐dākunō tanaku

2.Yeggeṟam̐gaka sēvanē nindarilōm̐ jēyam̐gānu
siggulenta niṇḍunokā cēri patiki
voggi yē poddunum̐ danavoddam̐ gācukuṇḍam̐gānu
veggaḷin̄carāka yenta vēsaṭoko tanaku

3.Gaṭṭi nā gubbala notti karam̐gin̄cam̐gānu panta
meṭṭokā śrī vēṅkaṭēśvaruniki
yiṭṭē tā nannum̐gūḍe yiṅkā nēm̐gosaram̐gā
reṭṭin̄ci tamakamulu rēm̐gunokā tanaku


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.