Main Menu

Anniyu Namde Amare (అన్నియు నందె అమరె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 280 | Keerthana 180 , Volume 9

Pallavi: Anniyu Namde Amare (అన్నియు నందె అమరె)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నందె అమరె నదె
సన్నపునవ్వులు చల్లే నిపుడు     ॥ పల్లవి ॥

చెక్కు నొక్కి నను సేదదేర్చి యిటు
దిక్కనఁ గోపము దీర్చితివి
యెక్కువ నినుఁ దొలు తేమని యంటినో
చిక్కి కాఁగిలించెద నే నిపుడు      ॥ అన్ని ॥

చనవులిచ్చి నను సమతు సేసి యిటు
పెనఁగి మంకు విడిపించితివి
యెనయ నపుడు నిను నెంతసేసితినో
చెనకి యధర మిచ్చెద నే నిపుడు   ॥ అన్ని ॥

సరసమాడి కడుఁ జవులుచూపి యిటు
గరిమతోడ ననుఁ గలసితివి
సరవి శ్రీవెంకటేశ్వర యే మెరఁగనో
అరసి తనిసి కొనియాడెద నిపుడు  ॥ అన్ని ॥

Pallavi

Anniyu nande amare nade
sannapunavvulu callē nipuḍu

Charanams

1.Cekku nokki nanu sēdadērci yiṭu
dikkanam̐ gōpamu dīrcitivi
yekkuva ninum̐ dolu tēmani yaṇṭinō
cikki kām̐gilin̄ceda nē nipuḍu

2.Canavulicci nanu samatu sēsi yiṭu
penam̐gi maṅku viḍipin̄citivi
yenaya napuḍu ninu nentasēsitinō
cenaki yadhara micceda nē nipuḍu

3.Sarasamāḍi kaḍum̐ javulucūpi yiṭu
garimatōḍa nanum̐ galasitivi
saravi śrīveṅkaṭēśvara yē meram̐ganō
arasi tanisi koniyāḍeda nipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.