Main Menu

Amdaakaa Neeku Mokkutaa (అందాఁకా నీకు మొక్కుతా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 302 | Keerthana 9, Volume 11

Pallavi:Amdaakaa Neeku Mokkutaa (అందాఁకా నీకు మొక్కుతా)
ARO: Pending
AVA: Pending

Ragam: Suddavasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాఁకా నీకు మొక్కుతా నంతా నింతా నుండేఁ గాక
యిందరిలోఁ బదరితే నిది సిగ్గు గాదా    ॥ పల్లవి ॥

ఆవల నీ వొకతెతో అట్టె మాటలాడఁగాను
చేపట్టి తియ్యగ బోతే సిగ్గు గాదా
వావిరి నాపెయు నీవు వసంతము లాడఁగాను
యీ వేళ నీ మోము చూచి దిది సిగ్గు గాదా  ॥అందా॥

కోరటు పరాకై నీవు కొమ్మను గూడుండగాను
చేరి నీతో నవ్వఁబోతే సిగ్గు గాదా
గారవించి యాపెతోయాకతము నీ వాడఁగాను
యీరీతి దగ్గరితేను యిది సిగ్గు గాదా    ॥అందా॥

అక్కడిరతుల నీవు అలసి వుండేవేళ
చెక్కులు నే నొక్కితేను సిగ్గు గాదా
గక్కన శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
యిక్కడ నవి దడవే దిది సిగ్గు గాదా    ॥అందా॥


Pallavi

Andām̐kā nīku mokkutā nantā nintā nuṇḍēm̐ gāka
yindarilōm̐ badaritē nidi siggu gādā

Charanams

1.Āvala nī vokatetō aṭṭe māṭalāḍam̐gānu
cēpaṭṭi tiyyaga bōtē siggu gādā
vāviri nāpeyu nīvu vasantamu lāḍam̐gānu
yī vēḷa nī mōmu cūci didi siggu gādā

2.Kōraṭu parākai nīvu kom’manu gūḍuṇḍagānu
cēri nītō navvam̐bōtē siggu gādā
gāravin̄ci yāpetōyākatamu nī vāḍam̐gānu
yīrīti daggaritēnu yidi siggu gādā

3.Akkaḍiratula nīvu alasi vuṇḍēvēḷa
cekkulu nē nokkitēnu siggu gādā
gakkana śrīveṅkaṭēśa kalasiti viṭu nannu
yikkaḍa navi daḍavē didi siggu gādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.