Main Menu

Andaakaa Vegiramaa (అందాఁకా వేగిరమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 288 | Keerthana 225 , Volume 9

Pallavi: Andaakaa Vegiramaa (అందాఁకా వేగిరమా)
ARO: Pending
AVA: Pending

Ragam: Himdolam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాఁకా వేగిరమా ఆఱడికాఁడ
చిందేవు మాటలఁ దేనె చెల్లు నీకు నయ్యా        ॥ పల్లవి ॥

నవ్వుతా నే నుండఁగానె నంటున గిలిగించేవు
అవ్వల నీ కింకా నెంత ఆసోద మోయి
పువ్వువంటి నావయసు పూఁచి నీపైఁ జల్లఁగానె
తవ్వేవు జాణతనాలు తమకి వౌదువు           ॥ అందా ॥

దగ్గరి నే నుండఁగానె దండకు నొత్తుకొనేవు
వెగ్గళించి నీకెంత వేగిరమోయి
సిగ్గుదేరి నీ మీఁద చేతులు నేఁ జాఁచఁగానె
వొగ్గి కాఁగిట బిగించేవు వుబ్బుకాఁడ వౌదువు       ॥ అందా ॥

కలసి నే నుండఁగానె కమ్మి రతికిఁ దీసేవు
లలి శ్రీవెంకటేశుఁడ లావరి వోయి
యెలమి నన్నేలితివి యియ్యకొంటి నే నట్టె
పలుకుఁ బంతము చెల్లె పనివాఁడ వౌదువు       ॥ అందా ॥

Pallavi

Andām̐kā vēgiramā āṟaḍikām̐ḍa
cindēvu māṭalam̐ dēne cellu nīku nayyā

Charanams

1.Navvutā nē nuṇḍam̐gāne naṇṭuna giligin̄cēvu
avvala nī kiṅkā nenta āsōda mōyi
puvvuvaṇṭi nāvayasu pūm̐ci nīpaim̐ jallam̐gāne
tavvēvu jāṇatanālu tamaki vauduvu

2.Daggari nē nuṇḍam̐gāne daṇḍaku nottukonēvu
veggaḷin̄ci nīkenta vēgiramōyi
siggudēri nī mīm̐da cētulu nēm̐ jām̐cam̐gāne
voggi kām̐giṭa bigin̄cēvu vubbukām̐ḍa vauduvu

3.Kalasi nē nuṇḍam̐gāne kam’mi ratikim̐ dīsēvu
lali śrīveṅkaṭēśum̐ḍa lāvari vōyi
yelami nannēlitivi yiyyakoṇṭi nē naṭṭe
palukum̐ bantamu celle panivām̐ḍa vauduvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.