Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 169 | Keerthana 406 , Volume 07
Pallavi: Amganacheluvu (అంగనచెలువు)
ARO: Pending
AVA: Pending
Ragam:Desalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంగన చెలువు చూడవయ్యా నీవు
సంగడి సింగారాలు సతమై నిలిచెను ॥పల్లవి॥
వెంటనె చంద్రుఁడు గడు వెన్నెల గాయఁగాను
వొంటిఁ జీఁకటి వెనకకొదిగినట్లు
నంటున నేఁడీచెలియ నవ్వుమోముతోనుండఁగ
అంటి వీఁపునఁ దురుము అందమై నిలిచెను ॥అంగ॥
చెలరేఁగి సింహము చేరి యెక్కితే భారాన
వెలికిఁ గరికుంభాలు వీఁగినయట్లు
మెలుఁత సన్నపు నడిమితోఁ జెలఁగఁగాను
బలిమిఁ బిరుఁదు కిందుపడి తా నిలిచెను ॥అంగ॥
కోవిల వేడుకఁ జవిగొనఁగా లేఁతచిగురు
శ్రీ వెంకటేశ్వర చిల్లులైనట్లు
నీవింతిఁ గూడఁగా నాపె నేరుపుల మాటలతో
వావాత మోవి కెంపులు వరుసలై నిలిచె ॥అంగ॥
Pallavi
Aṅgana celuvu cūḍavayyā nīvu
saṅgaḍi siṅgārālu satamai nilicenu
Charanams
1.Veṇṭane candrum̐ḍu gaḍu vennela gāyam̐gānu
voṇṭim̐ jīm̐kaṭi venakakodiginaṭlu
naṇṭuna nēm̐ḍīceliya navvumōmutōnuṇḍam̐ga
aṇṭi vīm̐punam̐ durumu andamai nilicenu
2.Celarēm̐gi sinhamu cēri yekkitē bhārāna
velikim̐ garikumbhālu vīm̐ginayaṭlu
melum̐ta sannapu naḍimitōm̐ jelam̐gam̐gānu
balimim̐ birum̐du kindupaḍi tā nilicenu
3.Kōvila vēḍukam̐ javigonam̐gā lēm̐taciguru
śrī veṅkaṭēśvara cillulainaṭlu
nīvintim̐ gūḍam̐gā nāpe nērupula māṭalatō
vāvāta mōvi kempulu varusalai nilice
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.