Main Menu

Ape Nenu Nokkate (ఆపే నేను నొక్కటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 557 | Keerthana 276 , Volume 13

Pallavi: Ape Nenu Nokkate (ఆపే నేను నొక్కటే)
ARO: Pending
AVA: Pending

Ragam: Gundakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆపే నేను నొక్కటే అందుకేమయ్యా
చేపట్టి యింతలో నేల సిగ్గులు వడేవు ॥ పల్లవి ॥

విన్నపములు వింటివా వెలఁది చెప్పెంపినవి
సన్నల నీకవి యెల్లా సరివచ్చెనా
నిన్నటి మీసుద్దులెల్లా నేఁదెలిసితి ననుచు
నన్నుఁ జూచి నీవేల నడుమఁ గొంకేవు ॥ ఆపే ॥

కానుక లందుకొంటివా కామిని నీకంపినవి
తానకమై యవి నీచిత్తానఁ బట్టెనా
నానాటి మీసరితలు నాకు దిష్ట మాయనని
నే నిప్పుడేమనఁగాను నీవింత లోఁగేవు ॥ ఆపే ॥

యేకతములాడితివా యింతిని రప్పించుకొని
కైకొని శ్రీవేంకటేశ కలసితివా
యీకడ నన్నేలితివి యిన్నియు నేగంటినని
నాకొరకు నెంతేసి నవ్వులు నవ్వేవు.   ॥ ఆపే ॥

Pallavi

Āpē nēnu nokkaṭē andukēmayyā
cēpaṭṭi yintalō nēla siggulu vaḍēvu

Charanams

1.Vinnapamulu viṇṭivā velam̐di ceppempinavi
sannala nīkavi yellā sarivaccenā
ninnaṭi mīsuddulellā nēm̐delisiti nanucu
nannum̐ jūci nīvēla naḍumam̐ goṅkēvu

2.Kānuka landukoṇṭivā kāmini nīkampinavi
tānakamai yavi nīcittānam̐ baṭṭenā
nānāṭi mīsaritalu nāku diṣṭa māyanani
nē nippuḍēmanam̐gānu nīvinta lōm̐gēvu

3.Yēkatamulāḍitivā yintini rappin̄cukoni
kaikoni śrīvēṅkaṭēśa kalasitivā
yīkaḍa nannēlitivi yinniyu nēgaṇṭinani
nākoraku nentēsi navvulu navvēvu.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.