Main Menu

Ade Choodu Tiruvenkataadri (ఆదె చూడు తిరువేంకటాద్రి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 37 | Keerthana 227 , Volume 1

Pallavi: Ade Choodu Tiruvenkataadri (ఆదె చూడు తిరువేంకటాద్రి)
ARO: Pending
AVA: Pending

Ragam:Malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Adechudu Tiruvenkataadri | ఆదెచూడు తిరువేంకటాద్రి     
Album: | Voice: S.P.Balasubrahmanyam


Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


1]అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము-
లందు [2]వెలుగొందీ ప్రభ మీరఁగాను   ॥ అదె ॥
తగ నూటయిరువైయెనిమిది తిరుపతుల గల
స్థానికులును చక్రవర్తి పీఠకములును
అగణితంబైన [3]దేశాంత్రుల మఠంబులును
నధికమై చెలువొందఁగాను
మిగుల నున్నతములగు మేడలును మాడుగులు
మితిలేని దివ్యతపసులున్న గృహములును
వొగి [4]నొరగుఁబెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు
దిగువ తిరుపతి గడవఁగాను   ॥ అదె ॥
పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొంది
పదినొండు యోజనంబుల పరపుననుఁ బరగి
చెదర కేవంక చూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను    ॥ అదె ॥
యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-
యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁద
అక్కజంబైన పల్లవరాయని మటము
అలయేట్లపేడ గడవ\న్
చక్కనేఁగుచు నవ్వచరిఁ గడచి హరిఁ దలఁచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచిన మీఁద-
నక్కడక్కడ వేంకటాద్రీశు సంపదలు
అంతంతఁ గానరాఁగాను    ॥ అదె ॥
బుగులుకొను పరిమళంబుల పూవుఁదోఁటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల-
నీడలను నిలిచి నిలిచి
గగనంబు దాఁకి శృంగారరసభరితమై
కనకమయమైన గోపురములనుఁ జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గల నగరు
సరుగననుఁ గానరాఁగాను    ॥ అదె ॥
ప్రాకటంబైన పాపవినాశనము[5]లోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోఁకిన భవము-
లంతంత వీఁడి పారఁగను
యీకడనుఁ గోనేట యతులుఁ బాశుపతుల్ మును-
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశుఁ డాదరిని
యేప్రొద్దు విహరించఁగాను    ॥ అదె ॥

Pallavi

]Ade cūḍu tiruvēṅkaṭādri nālugu yugamu-
landu [2]velugondī prabha mīram̐gānu

Charanams

Taga nūṭayiruvaiyenimidi tirupatula gala
sthānikulunu cakravarti pīṭhakamulunu
agaṇitambaina [3]dēśāntrula maṭhambulunu
nadhikamai celuvondam̐gānu
migula nunnatamulagu mēḍalunu māḍugulu
mitilēni divyatapasulunna gr̥hamulunu
vogi [4]noragum̐berumāḷḷa vunikipaṭṭayi velayu
diguva tirupati gaḍavam̐gānu

Podali yarayōjanamu poḍavunanum̐ bolupondi
padinoṇḍu yōjanambula parapunanum̐ baragi
cedara kēvaṅka cūcina mahābhūjamulu
sinhaśārdūlamulunu
kadisi suravarulu kinnarulu kimpuruṣulunu
garuḍa gandharva yakṣulunu vidyādharulu
viditamai viharin̄cu viśrāntadēśamula
vēḍukalu daivāragānu

Yekkuvala kekkuvai yesam̐gi velasina pedda-
yekku ḍatiśayamugā nekki nantaṭimīm̐da
akkajambaina pallavarāyani maṭamu
alayēṭlapēḍa gaḍava\n
cakkanēm̐gucu navvacarim̐ gaḍaci harim̐ dalam̐ci
mrokkucunu mōkāḷḷamuḍugu gaḍacina mīm̐da-
nakkaḍakkaḍa vēṅkaṭādrīśu sampadalu
antantam̐ gānarām̐gānu

Bugulukonu parimaḷambula pūvum̐dōm̐ṭalunu
pondaina nānāvidhambula vanambulunu
nigiḍi kikkirisi paṇḍina mahāvr̥kṣamula-
nīḍalanu nilici nilici
gaganambu dām̐ki śr̥ṅgārarasabharitamai
kanakamayamaina gōpuramulanum̐ jeluvondi
jagatīdharuni divyasampadalu gala nagaru
sarugananum̐ gānarām̐gānu

Prākaṭambaina pāpavināśanamu[5]lōni
bharitamagu duritamulu pagili pārucunuṇḍa
ākāśagaṅgatōyamulu sōm̐kina bhavamu-
lantanta vīm̐ḍi pāram̐ganu
yīkaḍanum̐ gōnēṭa yatulum̐ bāśupatul munu-
lenna naggalamaivunna vaiṣṇavulalō
yēkamai tiruvēṅkaṭādrīśum̐ ḍādarini
yēproddu viharin̄cam̐gānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.