Main Menu

Aduvaaramaitene (ఆడువారమైతేనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 172 | Keerthana 428 , Volume 7

Pallavi:Aduvaaramaitene (ఆడువారమైతేనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sokavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువారమైతేనే అంత సిగ్గు విడిచేమా
పేఁడుక పానుపుపైకి పిలిచేవు నీవు           ॥ పల్లవి ॥

ఏకాంతమునను మీరిద్దరూ నుండఁగాను
కాకుసేసి నేను దగ్గరవచ్చునా
మేకొని మీలోపల మీరే నవ్వుకోఁగా
యీకడ నే నెడచొచ్చి యెలయించవచ్చునా      ॥ ఆఁడు ॥

మచ్చిక నొకరొకరుమాఁటలాఁడుకొనగాను
వచ్చి నేఁ బొత్తు గలయవచ్చునా నేఁడు
పచ్చియైన వలపులను పరవశమై యుండఁగ
పచ్చడము గప్పి మిముఁ బలికించవచ్చునా      ॥ ఆఁడు ॥

నీవు నాపె గూడి నేరుపులు మెరయఁగాను
చేవదేర నేను సేవ సేయవచ్చునా
శ్రీ వెంకటేశ్వర నన్నుఁ జెందితివాకెకుఁ జెప్పి
మా వంటి వారికి మేలు మరవఁగవచ్చునా       ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvāramaitēnē anta siggu viḍicēmā
pēm̐ḍuka pānupupaiki pilicēvu nīvu

Charanams

1.Ēkāntamunanu mīriddarū nuṇḍam̐gānu
kākusēsi nēnu daggaravaccunā
mēkoni mīlōpala mīrē navvukōm̐gā
yīkaḍa nē neḍacocci yelayin̄cavaccunā

2.Maccika nokarokarumām̐ṭalām̐ḍukonagānu
vacci nēm̐ bottu galayavaccunā nēm̐ḍu
pacciyaina valapulanu paravaśamai yuṇḍam̐ga
paccaḍamu gappi mimum̐ balikin̄cavaccunā

3.Nīvu nāpe gūḍi nērupulu merayam̐gānu
cēvadēra nēnu sēva sēyavaccunā
śrī veṅkaṭēśvara nannum̐ jenditivākekum̐ jeppi
mā vaṇṭi vāriki mēlu maravam̐gavaccunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.