Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 87 | Keerthana 424 , Volume 1
Pallavi: Ade Vade (అదె వాడె)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
అదె వాఁడె యిదె వీఁడె అందు నిందు నేఁగీని
వెదకి వెదకి తిరువీధులందు దేవుఁడు ॥ పల్లవి ॥
అల సూర్యవీధి నేఁగీ నాదిత్యుని తేరిమీద
కలికికమలానందకరుఁడు గాన
తలపోసి అదియును దవ్వు చుట్టఱికమని
యిలఁ దేరిమీఁద నేఁగీ నిందిరావిభుఁడు ॥ అదె ॥
చక్క సోమవీధి నేఁగీ జందురుని తేరిమీఁద
యెక్కువైన కువలయహితుఁడు గాన
చుక్కలు మోచిన దవ్వుచుట్టరిక మిదియని
యిక్కువతో వీధి నేఁగీ నెన్నికైన దేవుఁడు ॥ అదె ॥
యింతుల మనోవీధి నేఁగీ మరు తేరిమీఁద-
నంతటా రతిప్రియుఁ డటుగాన
రంతుల నదియుఁ గానరాని చుట్టరికమని
వింతరీతి నేఁగీ శ్రీవేంకటాద్రిదేవుఁడు ॥ అదె॥
Pallavi
Ade vām̐ḍe yide vīm̐ḍe andu nindu nēm̐gīni
vedaki vedaki tiruvīdhulandu dēvum̐ḍu
Charanams
1.Ala sūryavīdhi nēm̐gī nādityuni tērimīda
kalikikamalānandakarum̐ḍu gāna
talapōsi adiyunu davvu cuṭṭaṟikamani
yilam̐ dērimīm̐da nēm̐gī nindirāvibhum̐ḍu
2.Cakka sōmavīdhi nēm̐gī janduruni tērimīm̐da
yekkuvaina kuvalayahitum̐ḍu gāna
cukkalu mōcina davvucuṭṭarika midiyani
yikkuvatō vīdhi nēm̐gī nennikaina dēvum̐ḍu
3.Yintula manōvīdhi nēm̐gī maru tērimīm̐da-
nantaṭā ratipriyum̐ ḍaṭugāna
rantula nadiyum̐ gānarāni cuṭṭarikamani
vintarīti nēm̐gī śrīvēṅkaṭādridēvum̐ḍu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.