Main Menu

Andulone Vinnapamu Lanniyu (అందులోనే విన్నపము లన్నియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1202 | Keerthana 11, Volume 22

Pallavi: Andulone Vinnapamu Lanniyu (అందులోనే విన్నపము లన్నియు)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే విన్నపము లన్నియు నున్నవి నాకు
మందలించి ఇంతకంటె మరి నేరననరే    ॥ పల్లవి ॥

వద్దు వద్దు తనతోడివాదులకు నే నోప
పొద్దువొద్దు వాసులకే పోరలఁ బట్టె
కద్దుగద్దు నామీఁదఁ గడు మోహము దనకు
ముద్దుముద్దువలె నిట్టె మొక్కితి నే ననరే   ॥ అందు ॥

చాలుఁజాలు చలములు సాదించఁ దరిగాదు
యేల యేల తనసుద్దు లిదె వింటివి
వేళ వేళ గాచికాచి వేగిరించితి నిందాఁక
మేలు మేలు దనపొందు మెచ్చితి నేననరే   ॥ అందు ॥

సారె సారె బోమ్మలను జంకించఁ బనిలేదు
తీరెఁ దీరెఁ గోపమెల్లాఁ దేటపడెను
చేరెఁజేరెఁ గాఁగిటిలో శ్రీవేంకటేశ్వరుఁడు
పేరెఁబేరెఁ దేనెలెల్ల పెదవుల ననరే       ॥ అందు ॥


Pallavi

Andulōnē vinnapamu lanniyu nunnavi nāku
mandalin̄ci intakaṇṭe mari nērananarē

Charanams

1.Vaddu vaddu tanatōḍivādulaku nē nōpa
podduvoddu vāsulakē pōralam̐ baṭṭe
kaddugaddu nāmīm̐dam̐ gaḍu mōhamu danaku
muddumudduvale niṭṭe mokkiti nē nanarē

2.Cālum̐jālu calamulu sādin̄cam̐ darigādu
yēla yēla tanasuddu lide viṇṭivi
vēḷa vēḷa gācikāci vēgirin̄citi nindām̐ka
mēlu mēlu danapondu mecciti nēnanarē

3.Sāre sāre bōm’malanu jaṅkin̄cam̐ banilēdu
tīrem̐ dīrem̐ gōpamellām̐ dēṭapaḍenu
cērem̐jērem̐ gām̐giṭilō śrīvēṅkaṭēśvarum̐ḍu
pērem̐bērem̐ dēnelella pedavula nanarē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.