Main Menu

Anniyu Neruchukonnaa Dalavaate (అన్నియు నేరుచుకొన్నా డలవాటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 327 | Keerthana 161 , Volume 11

Pallavi: Anniyu Neruchukonnaa Dalavaate (అన్నియు నేరుచుకొన్నా డలవాటే)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నేరుచుకొన్నాఁ డలవాటే యాతనికి
యెన్ని యైనఁ గల విట్టే యింటి కింక రావే   ॥ పల్లవి ॥

వట్టిమాకు లిగిరించు వాఁడు మాట లాడితేను
యిట్టె నన్ను గరఁగించు టేమి సోద్యమే
వెట్టికి వింటేం జాలు వేగాదాఁకఁ జేప్పీఁ దాను
బట్టబయ లీఁద నోపఁ బదవే మాయింటికి   ॥ అన్నియు ॥

ఱాతికి గిలిగింత లౌ ఱట్టడినవానిచేఁతల
యీతల నన్ను నవ్వించే దేమి సోద్యమే
చేతికి లో నైతేఁ జాలు సేయఁగల ట్టెల్లాఁ జేసి
పోతరించి వున్నవాఁడు పోదమే మా యింటికి ॥ అన్నియు ॥

యేరు లైన నెదు రెక్కు యిట్టి వీనిఁ బొడగంటే
యీరీతి మనము వచ్చే దేమి సోద్యమే
చేరినన్ను నిటు గూడె శ్రీవెంకటేశ్వరుఁడు
ఆరె దేరెఁ బిలువవే అతని మాయింటికి   ॥ అన్నియు ॥

Pallavi

Anniyu nērucukonnām̐ ḍalavāṭē yātaniki
yenni yainam̐ gala viṭṭē yiṇṭi kiṅka rāvē

Charanams

1.Vaṭṭimāku ligirin̄cu vām̐ḍu māṭa lāḍitēnu
yiṭṭe nannu garam̐gin̄cu ṭēmi sōdyamē
veṭṭiki viṇṭēṁ jālu vēgādām̐kam̐ jēppīm̐ dānu
baṭṭabaya līm̐da nōpam̐ badavē māyiṇṭiki

2.Ṟātiki giliginta lau ṟaṭṭaḍinavānicēm̐tala
yītala nannu navvin̄cē dēmi sōdyamē
cētiki lō naitēm̐ jālu sēyam̐gala ṭṭellām̐ jēsi
pōtarin̄ci vunnavām̐ḍu pōdamē mā yiṇṭiki

3.Yēru laina nedu rekku yiṭṭi vīnim̐ boḍagaṇṭē
yīrīti manamu vaccē dēmi sōdyamē
cērinannu niṭu gūḍe śrīveṅkaṭēśvarum̐ḍu
āre dērem̐ biluvavē atani māyiṇṭiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.