Main Menu

Amkeku Raanipanulainapaati (అంకెకు రానిపనులైనపాటి )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 199 | Keerthana 585 , Volume 7

Pallavi: Amkeku Raanipanulainapaati (అంకెకు రానిపనులైనపాటి )
ARO: Pending
AVA: Pending

Ragam:Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంకెకు రాని పనులైనపాటి చాలును
మంకులు చెల్లవు నిన్ను మరిగినదానను    ॥ పల్లవి ॥

పచరించి నీకు విన్నపములు సేసేవారి
వచనాలలోనే కానవచ్చె వలపు
రచనలు నేరుతుము రాజసాలు నేరుతుము
వుచితముగాకుండఁగా వూరకున్నదానను    ॥ అంకె ॥

సగము మొగము వంచి సన్నలు సేసేవారి
నగవందే అంతా వున్నది నిజము
పగటు నెరుఁగుదుము పంతమూనెరుగుదుము
జగడాలు చేరీనంటా సమ్మతించుకొంటిని    ॥ అంకె ॥

ఆయములు చూపి మోపి అప్పణలిచ్చేవారి
కాయకపు మొక్కులకే కలిగె మేలు
యీయెడ శ్రీ వెంకటేశ యిటు నిన్నుఁ గూడితిని
చేయి మీఁదై నవ్వులకు సెలవు పెట్టితిని    ॥ అంకె ॥


Pallavi

Aṅkeku rāni panulainapāṭi cālunu
maṅkulu cellavu ninnu mariginadānanu

Charanams

1.Pacarin̄ci nīku vinnapamulu sēsēvāri
vacanālalōnē kānavacce valapu
racanalu nērutumu rājasālu nērutumu
vucitamugākuṇḍam̐gā vūrakunnadānanu

2.Sagamu mogamu van̄ci sannalu sēsēvāri
nagavandē antā vunnadi nijamu
pagaṭu nerum̐gudumu pantamūnerugudumu
jagaḍālu cērīnaṇṭā sam’matin̄cukoṇṭini

3.Āyamulu cūpi mōpi appaṇaliccēvāri
kāyakapu mokkulakē kalige mēlu
yīyeḍa śrī veṅkaṭēśa yiṭu ninnum̐ gūḍitini
cēyi mīm̐dai navvulaku selavu peṭṭitini


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.