Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1211 | Keerthana 63 , Volume 22
Pallavi: Andari Kokkate Chaalu Aandlaku (అందరి కొక్కటే చాలు ఆండ్లకు)
ARO: Pending
AVA: Pending
Ragam: Samantham
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందరి కొక్కటే చాలే ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరె నీతో మోవనాడవలెనా ॥ పల్లవి ॥
వలపుల యీఁది యీఁది వాసులకే లోఁగిలోఁగి
అలుకలే తవ్వితవ్వి యట్టే నవ్వి
చెలఁగేటివిరహివి చింత మాన్ప నెఱఁగవా
చెలి నింతే నీకు నేను చెప్పిచూపవలెనా ॥ అంద ॥
బలిమై చేయి చాఁచిచాఁచి పంతాన మెయిదోఁచితోఁచి
పలుకాఁకఁ గందికంది భామలఁ బొంది
కులుకు జాణఁడవు నాకోర్కి దీర్చనెఱఁగవా
ఇల నే జవ్వని నింతే ఇంతరట్టువలెనా ॥ అంద ॥
పలుకులే చల్లి చల్లి పారిపారి మళ్లీమళ్లీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్లి
తలఁచి శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
వెలయు నీదేవి నింతే వేఁడుకొనవలెనా ॥ అంద ॥
Pallavi
Andari kokkaṭē cālē āṇḍlaku mogalaku
mundaṭettu vēre nītō mōvanāḍavalenā
Charanams
1.Valapula yīm̐di yīm̐di vāsulakē lōm̐gilōm̐gi
alukalē tavvitavvi yaṭṭē navvi
celam̐gēṭivirahivi cinta mānpa neṟam̐gavā
celi nintē nīku nēnu ceppicūpavalenā
2.Balimai cēyi cām̐cicām̐ci pantāna meyidōm̐citōm̐ci
palukām̐kam̐ gandikandi bhāmalam̐ bondi
kuluku jāṇam̐ḍavu nākōrki dīrcaneṟam̐gavā
ila nē javvani nintē intaraṭṭuvalenā
3.Palukulē calli calli pāripāri maḷlīmaḷlī
valarācapanulakē vayyāḷi veḷli
talam̐ci śrīvēṅkaṭēśa taga nannum̐ gūḍitivi
velayu nīdēvi nintē vēm̐ḍukonavalenā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.