Main Menu

Antakopudumaa Nemu Aavune (అంతకోపుదుమా నేము ఆవునే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1213 | Keerthana 75 , Volume 22

Pallavi: Antakopudumaa Nemu Aavune (అంతకోపుదుమా నేము ఆవునే)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతకోపుదుమా నేము అవునే తాను
పంతమా నాతో నింత భళా తాను      ॥ పల్లవి ॥

రెప్పలెత్తి నన్నుఁ జూచె రేసులకే తలవంచె –
నప్పటిని మగనాలి నద్దో తాను
తప్పక మోము గిరిపె తనలోనే తానవ్వె
ఇపుడే తా మానఁడుగా యెవ్వఁడే తాను    ॥ అంత ॥

వచ్చివచ్చి వేఁడుకొనీ వద్దంటేఁ గోపగించీ
అచ్చలము నాతోనేల అప్పటిఁ దాను
రచ్చల నెమ్మెలు చూపి రాజనంటాఁ బచ్చిసేసీ
యెచ్చుకుందు తనకు నా కేడకేడే తాను    ॥ అంత ॥

బుద్దులు చెప్పఁగ వచ్చి పూఁచినవాకిళ్లు దాఁటి
అద్దమరేతిరికాడ నాయఁగా తాను
దిద్దుచు శ్రీవేంకటాద్రిదేవుఁడు నన్నిటు గూడె
వొద్ద నుండి ఇంత సేయ నోపునా తాను    ॥ అంత ॥


Pallavi

Antakōpudumā nēmu avunē tānu
pantamā nātō ninta bhaḷā tānu

Charanams

1.Reppaletti nannum̐ jūce rēsulakē talavan̄ce –
nappaṭini maganāli naddō tānu
tappaka mōmu giripe tanalōnē tānavve
ipuḍē tā mānam̐ḍugā yevvam̐ḍē tānu

2.Vaccivacci vēm̐ḍukonī vaddaṇṭēm̐ gōpagin̄cī
accalamu nātōnēla appaṭim̐ dānu
raccala nem’melu cūpi rājanaṇṭām̐ baccisēsī
yeccukundu tanaku nā kēḍakēḍē tānu

3.Buddulu ceppam̐ga vacci pūm̐cinavākiḷlu dām̐ṭi
addamarētirikāḍa nāyam̐gā tānu
didducu śrīvēṅkaṭādridēvum̐ḍu nanniṭu gūḍe
vodda nuṇḍi inta sēya nōpunā tānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.