Main Menu

Anateevayya Nee Velalavi Yetto Yerugamu (ఆనతీవయ్య నీ వేళలవి యెట్టో యెఱుగము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 469 | Keerthana 352 , Volume 12

Pallavi: Anateevayya Nee Velalavi Yetto Yerugamu (ఆనతీవయ్య నీ వేళలవి యెట్టో యెఱుగము)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతీవయ్య నీ వేళలవి యెట్టో యెఱుఁగము
వూని నిన్ను విచారించ కూరకుండరాదు    ॥ పల్లవి ॥

బత్తి తో నెవ్వతె మీఁది పరాకున నున్నాఁడవో
హత్తి నే నీ వేళ మాటలాడ వచ్చునా
కొత్తగా నే యింతిఁ బిల్చుకొనే నని వున్నాఁడవో
యెత్తి నీ తెర దీసి నిన్నిటు చూడవచ్చునా   ॥ ఆన ॥

మఱి యెవ్వతె కీ పొద్దు మాట యిచ్చుకున్నాఁడవో
యెఱుఁగక నీకు వీడె మియ్య వచ్చునా
గుఱిగా నేసతిరాక గోరుక నీ వున్నాఁడవో
తఱితో నిప్పుడు నీ పాదము లొత్త వచ్చునా ॥ ఆన ॥

అరుదుగా నెవ్వతెకు నాసపడి వున్నాఁడవో
వరుసకు నే నీతో నవ్వఁగవచ్చునా
ఇరవై శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
మరిగి నీ గుణములు మఱవఁగ వచ్చునా   ॥ ఆన ॥

Pallavi

Ānatīvayya nī vēḷalavi yeṭṭō yeṟum̐gamu
vūni ninnu vicārin̄ca kūrakuṇḍarādu

Charanams

1.Batti tō nevvate mīm̐di parākuna nunnām̐ḍavō
hatti nē nī vēḷa māṭalāḍa vaccunā
kottagā nē yintim̐ bilcukonē nani vunnām̐ḍavō
yetti nī tera dīsi ninniṭu cūḍavaccunā

2.Maṟi yevvate kī poddu māṭa yiccukunnām̐ḍavō
yeṟum̐gaka nīku vīḍe miyya vaccunā
guṟigā nēsatirāka gōruka nī vunnām̐ḍavō
taṟitō nippuḍu nī pādamu lotta vaccunā

3.Arudugā nevvateku nāsapaḍi vunnām̐ḍavō
varusaku nē nītō navvam̐gavaccunā
iravai śrī vēṅkaṭēśa yiṭṭē nannu nēlitivi
marigi nī guṇamulu maṟavam̐ga vaccunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.