Main Menu

Amdukemi Dosamaa Ataniki Neeku Veraa (అందుకేమి దోసమా ఆతనికి నీకు వేరా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1112 | Keerthana 64 , Volume 21

Pallavi:Amdukemi Dosamaa Ataniki Neeku Veraa (అందుకేమి దోసమా ఆతనికి నీకు వేరా)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అతనికి నీకు వేరా
సందడి నాతని రతి సమ్మతించవే     ॥ పల్లవి ॥

మోహముగలుగువారు ముందువెనక లెంచరు
యీహల మొక్కెనంటా నీవేల లోఁగేవే
సాహసములూఁ జేతురు చనవులూఁ జెల్లింతురు
పోహణించి వలపుల భోగించవే       ॥ అందు ॥

తమిగలిగినవారు దండనుండి పాయరు
కొమరెనంటానేల కొంకఁజూచేవే
జమళిఁ జొక్కుదురు ఇచ్చల నవ్వుదురు తాము
చెమట చిత్తడి తోడ చెలరేఁగవే       ॥ అందు ॥

ఆయమెరిఁగినవారు అట్టె కాఁగిలింతురు
చేయివట్టెనంటానేల సిగ్గువడేవే
యీయెడ శ్రీవేంకటేశుఁ డిదె నిన్నుఁ గూడె నేఁడు
చాయలు సేసుక ఇట్టె చనవియ్యవే    ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā ataniki nīku vērā
sandaḍi nātani rati sam’matin̄cavē

Charanams

1.Mōhamugaluguvāru munduvenaka len̄caru
yīhala mokkenaṇṭā nīvēla lōm̐gēvē
sāhasamulūm̐ jēturu canavulūm̐ jellinturu
pōhaṇin̄ci valapula bhōgin̄cavē

2.Tamigaliginavāru daṇḍanuṇḍi pāyaru
komarenaṇṭānēla koṅkam̐jūcēvē
jamaḷim̐ jokkuduru iccala navvuduru tāmu
cemaṭa cittaḍi tōḍa celarēm̐gavē

3.Āyamerim̐ginavāru aṭṭe kām̐gilinturu
cēyivaṭṭenaṇṭānēla sigguvaḍēvē
yīyeḍa śrīvēṅkaṭēśum̐ ḍide ninnum̐ gūḍe nēm̐ḍu
cāyalu sēsuka iṭṭe canaviyyavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.