Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1117 | Keerthana 95 , Volume 21
Pallavi: Amdarini Yimaate (అందరిని యీమాటే)
ARO: Pending
AVA: Pending
Ragam: Salangam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందరిని యీమాఁటే అడుగవయ్యా
కందువలు నీకు నీకే కానరాదుగానీ ॥ పల్లవి ॥
వనిత యిప్పుడే నీవద్దికి రాఁగానే
మనసు నీ కొక్కటాయ మాఁటలేఁటికి
చెనకి నే మిందాఁకాఁ జేసినచేఁతలకెల్లా
వొనరి యిటువలెనే వుండుగా నీమొగము ॥అంద॥
చాఁచి చాఁచి నీ కాపె సారె విడెమియ్యఁగానే
పూఁచినపూఁవు లీడేరె బొంకులేఁటికి
తూఁచి వలపు నేమెల్లా తోడగడ్డెము వేయఁగా
పాఁచి సంతోసాలిట్లాఁ బ్రబలెనా నీకు ॥అంద॥
గక్కన నీదేవు లిట్టె కాఁగిలించుకొనఁగానే
చక్కనాయఁ బనులెల్లా సటలేఁటికి
యిక్కువ శ్రీవేంకటేశ యిద్దరూఁ గూడఁగాఁగాక
చిక్కనినవ్వు లిట్లాఁ జేకూడెనా ॥అంద॥
Pallavi
Andarini yīmām̐ṭē aḍugavayyā
kanduvalu nīku nīkē kānarādugānī
Charanams
1.Vanita yippuḍē nīvaddiki rām̐gānē
manasu nī kokkaṭāya mām̐ṭalēm̐ṭiki
cenaki nē mindām̐kām̐ jēsinacēm̐talakellā
vonari yiṭuvalenē vuṇḍugā nīmogamu
2.Cām̐ci cām̐ci nī kāpe sāre viḍemiyyam̐gānē
pūm̐cinapūm̐vu līḍēre boṅkulēm̐ṭiki
tūm̐ci valapu nēmellā tōḍagaḍḍemu vēyam̐gā
pām̐ci santōsāliṭlām̐ brabalenā nīku
3.Gakkana nīdēvu liṭṭe kām̐gilin̄cukonam̐gānē
cakkanāyam̐ banulellā saṭalēm̐ṭiki
yikkuva śrīvēṅkaṭēśa yiddarūm̐ gūḍam̐gām̐gāka
cikkaninavvu liṭlām̐ jēkūḍenā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.