Main Menu

Anniyu Marachi (అన్నియు మరచి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 590 | Keerthana 475 , Volume 13

Pallavi: Anniyu Marachi (అన్నియు మరచి)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు మరచి నీవాడిన ట్లాడుట గాక
పన్నిన పంతములేల పట్టి పెనఁగఁగను    ॥ పల్లవి ॥

వోడక నిన్నెటువలె నూరక సొలయవచ్చు
యేడలేని వినయము రెల్లాఁ జేయఁగా
పాడితో నిన్నుఁ దప్పులు పట్ట నెటువలె వచ్చు
వీడెము చేతికిచ్చి వేడుకొనఁగాను      ॥ అన్నియు ॥

చేయి చాఁచి నిన్నెట్టు చెనకకు మనవచ్చు
ఆయము గరఁగి నీవాసపడఁగా
చాయల సన్నల నిన్ను జంకించ నెట్టు వచ్చు
పాయము నాసొమ్ముసేసి బాఁతిపడఁగాను   ॥ అన్నియు ॥

తగిలి నీకాఁగిటిలో తనియంగ నెట్టువచ్చు
మిగులా నీనేరుపులు మెఱయఁగాను
అగవడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
బగివాయ నెట్టు వచ్చు పాలార్చఁగాను    ॥ అన్నియు ॥

Pallavi

Anniyu maraci nīvāḍina ṭlāḍuṭa gāka
pannina pantamulēla paṭṭi penam̐gam̐ganu

Charanams

1.Vōḍaka ninneṭuvale nūraka solayavaccu
yēḍalēni vinayamu rellām̐ jēyam̐gā
pāḍitō ninnum̐ dappulu paṭṭa neṭuvale vaccu
vīḍemu cētikicci vēḍukonam̐gānu

2.Cēyi cām̐ci ninneṭṭu cenakaku manavaccu
āyamu garam̐gi nīvāsapaḍam̐gā
cāyala sannala ninnu jaṅkin̄ca neṭṭu vaccu
pāyamu nāsom’musēsi bām̐tipaḍam̐gānu

3.Tagili nīkām̐giṭilō taniyaṅga neṭṭuvaccu
migulā nīnērupulu meṟayam̐gānu
agavaḍi śrīvēṅkaṭādhipa nannēlitivi
bagivāya neṭṭu vaccu pālārcam̐gānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.