Main Menu

Anniyu Jakkanayyeeni (అన్నియు జక్కనయ్యీని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1130 | Keerthana 174 , Volume 21

Pallavi: Anniyu Jakkanayyeeni (అన్నియు జక్కనయ్యీని)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedara Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ జక్కనయ్యీని అందుకేమిలేవయ్య
నున్నని వలపే కాదా నూఁగులెక్కెఁ గాక ॥ పల్లవి ॥

సారె నీవాడె వెల్లా చల్లనిమాటనే కావా
వేరేసతులఁ గూడఁగ వేఁడాయఁ గాక
మేరతో నవ్వేదెల్లా మించువెన్నెలలే కావా
యీరనపువారివల్ల యెండలాయ గాక   ॥ అన్ని ॥

మక్కువ నీనిలువెల్లా మంచితనమే కాదా
వెక్కసానఁ దిరుగఁగ వెట్టాయఁగాక
పక్కున నీమోవెల్లాఁ బచ్చితేనెలే కావా
వుక్కపలుసోఁకులను వొగరాయఁగాక   ॥ అన్ని ॥

కందువ నీకాఁగిలెల్లా కామనిధానమే కాదా
అందునిందు నంటుముట్టు లాయఁగాక
విందువలె నన్నును శ్రీవేంకటేశ కూడితివి
సందడి నన్నిటివల్లాఁ జవులాయఁగాక ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ jakkanayyīni andukēmilēvayya
nunnani valapē kādā nūm̐gulekkem̐ gāka

Charanams

1.Sāre nīvāḍe vellā callanimāṭanē kāvā
vērēsatulam̐ gūḍam̐ga vēm̐ḍāyam̐ gāka
mēratō navvēdellā min̄cuvennelalē kāvā
yīranapuvārivalla yeṇḍalāya gāka

2.Makkuva nīniluvellā man̄citanamē kādā
vekkasānam̐ dirugam̐ga veṭṭāyam̐gāka
pakkuna nīmōvellām̐ baccitēnelē kāvā
vukkapalusōm̐kulanu vogarāyam̐gāka

3.Kanduva nīkām̐gilellā kāmanidhānamē kādā
andunindu naṇṭumuṭṭu lāyam̐gāka
vinduvale nannunu śrīvēṅkaṭēśa kūḍitivi
sandaḍi nanniṭivallām̐ javulāyam̐gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.