Main Menu

Aaduvaari Gora Sesi Amduraa (ఆడువారి గోర సేసి అందురా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 672 | Keerthana 432 , Volume 14

Pallavi:Aaduvaari Gora Sesi Amduraa (ఆడువారి గోర సేసి అందురా)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువారి గోర సేసి అందురా నీవు
నేఁడు నీ మేలుకుఁ జొక్కి నెమ్మది నుండితిని   ॥ పల్లవి ॥

యిన్నిటా జాణఁడ వని యిచ్చకుఁడ వౌదు వని
మొన్ననే చూచి నీకు మొక్కనా నేను
నన్ను నేల దూరేవు నగి నిన్ను మెచ్చనంటా
పన్నిన నీరతిచేతఁ బరవశ మైతిని         ॥ ఆఁడు ॥

తప్పవు నీమాఁట లని తగు మంచివాఁడ వని
అప్పుడె నీచెక్కు గోర నంట నానేను
తప్పులేల యెంచేవు తగిలి పొగడనంటా
నెప్పున నీ ప్రియానకు నివ్వెర గందితిని      ॥ ఆఁడు ॥

కత కరచితి వని కాఁగిటఁ గూడితి వని
యితవుతో నీవుర మెక్కనా నేను
గతియై శ్రీవేంకటేశ కాఁగిటఁ గూడితి నన్ను
తతి నీ గుణాలఁ జిక్కి తమక మందితిని      ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvāri gōra sēsi andurā nīvu
nēm̐ḍu nī mēlukum̐ jokki nem’madi nuṇḍitini

Charanams

1.Yinniṭā jāṇam̐ḍa vani yiccakum̐ḍa vaudu vani
monnanē cūci nīku mokkanā nēnu
nannu nēla dūrēvu nagi ninnu meccanaṇṭā
pannina nīraticētam̐ baravaśa maitini

2.Tappavu nīmām̐ṭa lani tagu man̄civām̐ḍa vani
appuḍe nīcekku gōra naṇṭa nānēnu
tappulēla yen̄cēvu tagili pogaḍanaṇṭā
neppuna nī priyānaku nivvera ganditini

3.Kata karaciti vani kām̐giṭam̐ gūḍiti vani
yitavutō nīvura mekkanā nēnu
gatiyai śrīvēṅkaṭēśa kām̐giṭam̐ gūḍiti nannu
tati nī guṇālam̐ jikki tamaka manditini


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.