Main Menu

Anninyu Nenerugudu (అన్నియు నేనెఱుఁగుదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 593 | Keerthana 492 , Volume 13

Pallavi: Anninyu Nenerugudu (అన్నియు నేనెఱుఁగుదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నేనెఱుఁగుదు నంత బడలకు నీవు
సన్నలు సేయఁగఁ బైపై జడిసీఁ బులకలు   ॥ పల్లవి ॥

యించుకే మాటాడవోయిటు నాతోను
పొంచిన నీమోవి గెంపులు రేఁగీని
వంచకువోయి శిరసు వడిఁ జెక్కుపై
వుంచవు నీ కొప్పు పువ్వులు రాలీని      ॥ అన్ని ॥

చేతులు చాఁచకువోయి చేరి నాపైని
యేతలి గురుతులు బాయిటఁ బడీని
ఘాతల జూడకువోయి కన్నవారినే
రాతిరి సిగ్గులు నేఁడు రచ్చఁ బడీని      ॥ అన్ని ॥

పెనఁగకువోయి ముట్టి బెరసి నాతో
తనువుపై వాసనలు తగిలీ నన్ను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలిసితి మిద్దరము
అనుమానించకువోయి అడికె వచ్చీని   ॥ అన్ని ॥

Pallavi

Anniyu nēneṟum̐gudu nanta baḍalaku nīvu
sannalu sēyam̐gam̐ baipai jaḍisīm̐ bulakalu

Charanams

1.Yin̄cukē māṭāḍavōyiṭu nātōnu
pon̄cina nīmōvi gempulu rēm̐gīni
van̄cakuvōyi śirasu vaḍim̐ jekkupai
vun̄cavu nī koppu puvvulu rālīni

2.Cētulu cām̐cakuvōyi cēri nāpaini
yētali gurutulu bāyiṭam̐ baḍīni
ghātala jūḍakuvōyi kannavārinē
rātiri siggulu nēm̐ḍu raccam̐ baḍīni

3.Penam̐gakuvōyi muṭṭi berasi nātō
tanuvupai vāsanalu tagilī nannu
ghanum̐ḍa śrīvēṅkaṭēśa kalisiti middaramu
anumānin̄cakuvōyi aḍike vaccīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.