Main Menu

Annitaa Nerparivi Nee (అన్నిటా నేర్పరివి నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.731 | Keerthana 175 , Volume 16

Pallavi: Annitaa Nerparivi Nee (అన్నిటా నేర్పరివి నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా నేర్పరివి నీ వౌదువయ్యా
యెన్ని ప్రియములు చెప్పే వేమి సేతువయ్యా ॥ పల్లవి ॥

మక్కువ చల్లనే పట్టె మాటలాడనే పట్టె
వెక్కసాన నీతో నవ్వ వేళ లేదు
యిక్కువలు గరఁగతి యింపులనే పెరిగితి
యెక్కడ నీవు దనియ వేమి సేతువయ్యా   ॥ అన్ని ॥

మోము చూడనే పట్టె మోము నించనే పట్టె
వేమరుఁ జేయెత్తి మొక్క వేళ లేదు
నామనసు నీ కిచ్చితి నాఁడె నిన్ను మెచ్చితి
యేమిటికిఁ వేవు యేమి సేతువయ్యా      ॥ అన్ని॥

కదిసి వుండనె పట్టె కాఁగిలించనె పట్టి
వెదకి దూరు వేయఁగ వేళ లేదు
యిదివో శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
యెదుటనె వున్నాఁడ వేమి సేతువయ్యా   ॥ అన్ని॥

Pallavi

Anniṭā nērparivi nī vauduvayyā
yenni priyamulu ceppē vēmi sētuvayyā

Charanams

1.Makkuva callanē paṭṭe māṭalāḍanē paṭṭe
vekkasāna nītō navva vēḷa lēdu
yikkuvalu garam̐gati yimpulanē perigiti
yekkaḍa nīvu daniya vēmi sētuvayyā

2.Mōmu cūḍanē paṭṭe mōmu nin̄canē paṭṭe
vēmarum̐ jēyetti mokka vēḷa lēdu
nāmanasu nī kicciti nām̐ḍe ninnu mecciti
yēmiṭikim̐ vēvu yēmi sētuvayyā

3.Kadisi vuṇḍane paṭṭe kām̐gilin̄cane paṭṭi
vedaki dūru vēyam̐ga vēḷa lēdu
yidivō śrī vēṅkaṭēśa yenasiti viṭu nannu
yeduṭane vunnām̐ḍa vēmi sētuvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.