Main Menu

Adugare Chelulaala Atanine Yee Maata (అడుగరే చెలులాల అతనినే యీ మాట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 490 | Keerthana 475 , Volume 12

Pallavi: Adugare Chelulaala Atanine Yee Maata (అడుగరే చెలులాల అతనినే యీ మాట)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆతనినే యీ మాట
యెడయని విన్నపము లివి నావి యనరే    ॥ పల్లవి ॥

వినయము గలిగిన వెలఁది పొందులు చవి
మనసు నమ్మిన యట్టి మాటలు చవి
తనివోని వలపుల తలపోఁతలు చవి
పెనగొన్న కౌఁగిటిలో బిగువు చవి       ॥ అడుగరే ॥

మచ్చికలు సలిపేటి మంతనంబులు చవి
ఇచ్చకము నడుపేటి యింపులు చవి
విచ్చన విళ్ళైన వేడుక చేఁతలు చవి
కొచ్చి కొచ్చి కొసరేటి కూరిమి చవి       ॥ అడుగరే ॥

మొక్కుచు సారెకుఁ జూచే మచ్చట చూపులు చవి
చొక్కేటి రతి వేళల సుద్దులు చవి
యిక్కడ శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
దక్కిన తమకముల తరితీవులు చవి    ॥ అడుగరే ॥

Pallavi

Aḍugarē celulāla ātaninē yī māṭa
yeḍayani vinnapamu livi nāvi yanarē

Charanams

1.Vinayamu galigina velam̐di pondulu cavi
manasu nam’mina yaṭṭi māṭalu cavi
tanivōni valapula talapōm̐talu cavi
penagonna kaum̐giṭilō biguvu cavi

2.Maccikalu salipēṭi mantanambulu cavi
iccakamu naḍupēṭi yimpulu cavi
viccana viḷḷaina vēḍuka cēm̐talu cavi
kocci kocci kosarēṭi kūrimi cavi

3.Mokkucu sārekum̐ jūcē maccaṭa cūpulu cavi
cokkēṭi rati vēḷala suddulu cavi
yikkaḍa śrī vēṅkaṭēśum̐ḍintalōnē nannum̐gūḍe
dakkina tamakamula taritīvulu cavi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.