Main Menu

Amparaadaa Gerutulu Amdaakaanu (అంపరాదా గెరుతులు అందాకాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 737 | Keerthana 213 , Volume 16

Pallavi:Amparaadaa Gerutulu Amdaakaanu (అంపరాదా గెరుతులు అందాకాను)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంపరాదా గురుతులు అందాఁకాను
యింపులే చల్లీ నిన్ను యెనయుదాఁకాను    ॥ పల్లవి ॥

అంగన నీపాదుకలు అంపు మనె నిన్నాడకు
చెంగట నీవు విచ్చేసినదాఁకాను
వుంగరమే పూజించుక వుండేననే నీమారు
కంగుదీర నీరూపము కన్నదాఁకాను      ॥ అంప ॥

నీపదాలు వినిపించేనేలఁతల నంపు మనె
ఆపొద్దు నీతో మాటలాడుదాఁకాను
యేపున విం దాయితము యిట్టే సేసు కుండే ననె
చేపట్టి నీవు దన్ను మెచ్చినదాఁకాను     ॥ అంప ॥

తలఁపు లోఁ గలిగి నీతమ్ములమె యంపుమనె
నిలిచి నీరతుల మన్నించుదాఁకాను
అలరి శ్రీ వేంకటేశ ఆపె నిట్టె కూడితివి
కలసి తా నుండే ననె కమ్మటి నిందాఁకాను   ॥ అంప ॥


Pallavi

Amparādā gurutulu andām̐kānu
yimpulē callī ninnu yenayudām̐kānu

Charanams

1.Aṅgana nīpādukalu ampu mane ninnāḍaku
ceṅgaṭa nīvu viccēsinadām̐kānu
vuṅgaramē pūjin̄cuka vuṇḍēnanē nīmāru
kaṅgudīra nīrūpamu kannadām̐kānu

2.Nīpadālu vinipin̄cēnēlam̐tala nampu mane
āpoddu nītō māṭalāḍudām̐kānu
yēpuna viṁ dāyitamu yiṭṭē sēsu kuṇḍē nane
cēpaṭṭi nīvu dannu meccinadām̐kānu

3.Talam̐pu lōm̐ galigi nītam’mulame yampumane
nilici nīratula mannin̄cudām̐kānu
alari śrī vēṅkaṭēśa āpe niṭṭe kūḍitivi
kalasi tā nuṇḍē nane kam’maṭi nindām̐kānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.