Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
ఆనుక నీ వాడినట్టే ఆపెతో నే విన్నవించే
వీనుల నీ మాట లెల్ల వింటిఁగా నేను
కానుకగాఁ బట్టె మయ్య కాంతకు నీ సరితెలు
యీ నిజాలె చెల్లించుకో యేల నవ్వే విఁకను ॥ అన్నియు ॥
అక్కడనే పనులు అందాలుగాఁ జేసి వచ్చే
గక్కన నీ చేఁత లెల్లఁ గంటిఁ గా నేను
పెక్కు నీవినయములు బిందెల నించే నాపెకు
యిక్కడనే వుండవయ్య యేల నవ్వే విఁకను ॥ అన్నియు ॥
తీపులు గా నీరాక తేట తెల్లములు సేసే
నాపెకు నీకు లో నైతిఁ గా నేను
యేపున శ్రీవెంకటేశ యిద్దరిఁ గూడించితిని
యేప నైనా నాన తీ నీ వేల నవ్వే విఁకను ॥ అన్నియు ॥
No comments yet.