Main Menu

Amdukemi Dosamaa Atuvamtivaadavaa (అందుకేమి దోసమా అటువంటివాడవా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1148 | Keerthana 281 , Volume 21

Pallavi: Amdukemi Dosamaa Atuvamtivaadavaa (అందుకేమి దోసమా అటువంటివాడవా)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అటువంటివాఁడవా
నిందలేని నీమీఁద నించవద్దా మోహము  ॥ పల్లవి ॥

తగవు నీవు చెప్పఁగా తప్పు లందు లేకుండఁగా
నగరాదా నీతోను నయముగాను
మొగము నీవుచూడఁగ మొక్కులు చేత నుండఁగ
చిగురుఁబెదవులెత్తి చెప్పరాదా ప్రియము ॥ అందు ॥

కప్పురము నీ వియ్యఁగా కాయమెల్లఁ జల్లఁగాఁగా
ముప్పిరి మెచ్చఁగ వద్దా ముందు ముందే
కొప్పు నీవు దువ్వఁగాను కొంగు చేతఁ బట్టఁగాను
నెప్పున సిగ్గులు నీపై నించరాదా నాకును ॥ అందు ॥

విడెము చేతికియ్యఁగా వేడుకఁ గాఁగిలించఁగా
కూడవద్దా నిన్ను నేను కొఱతదీర
జోడై నీ వుండఁగాను చొక్కఁగా శ్రీవేంకటేశ
వూడిగాలుసేసి వొద్దనుండరాదా ఇఁకను ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā aṭuvaṇṭivām̐ḍavā
nindalēni nīmīm̐da nin̄cavaddā mōhamu

Charanams

1.Tagavu nīvu ceppam̐gā tappu landu lēkuṇḍam̐gā
nagarādā nītōnu nayamugānu
mogamu nīvucūḍam̐ga mokkulu cēta nuṇḍam̐ga
cigurum̐bedavuletti cepparādā priyamu

2.Kappuramu nī viyyam̐gā kāyamellam̐ jallam̐gām̐gā
muppiri meccam̐ga vaddā mundu mundē
koppu nīvu duvvam̐gānu koṅgu cētam̐ baṭṭam̐gānu
neppuna siggulu nīpai nin̄carādā nākunu

3.Viḍemu cētikiyyam̐gā vēḍukam̐ gām̐gilin̄cam̐gā
kūḍavaddā ninnu nēnu koṟatadīra
jōḍai nī vuṇḍam̐gānu cokkam̐gā śrīvēṅkaṭēśa
vūḍigālusēsi voddanuṇḍarādā im̐kanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.