Main Menu

Amdukane Gaaka Nenu (అందుకనేఁ గాక నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 600 | Keerthana 533 , Volume 13

Pallavi: Amdukane Gaaka Nenu (అందుకనేఁ గాక నేను)

ARO: Pending
AVA: Pending

Ragam: Manohari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకనేఁ గాక నేను అడుగుకో నోపనా
యెందరికైనాఁ దాను ఇచ్చకములాడునే     ॥ పల్లవి ॥

ఆవేళ కక్కూర్తిమాట లాడుఁగాని వేరొకతె
కైవశము సేసుకొంటే గానిమ్మనునే
చేవట్టి నేఁదీసితే చిత్తగించి వచ్చీఁ గాని
వావి యెవ్వతె చెప్పినా వలపులు చల్లునే    ॥ అందు ॥

వొద్దనున్న అంతవడి వొడఁబడి వుండుఁగాని
బుద్దియెవ్వతె చెప్పినా నపుడే వినునే
తిద్దుకొని బాసగొంటే దిష్టముగా నిచ్చుఁగాని
బద్దు లెవ్వతాడించినాఁ బలుమారు నాడునే  ॥ అందు ॥

సరసములాడితేను చనవిచ్చుఁ గాని వేరే
తరుణి కాఁగిలించితే దక్కివుండునే
యిరవై శ్రీవేంకటేశుఁడిటు తానే నన్ను గూఁడె
యెరవుల వారినెల్లా నెనసీ నెనయఁడే      ॥ అందు ॥


Pallavi

Andukanēm̐ gāka nēnu aḍugukō nōpanā
yendarikainām̐ dānu iccakamulāḍunē

Charanams

1.Āvēḷa kakkūrtimāṭa lāḍum̐gāni vērokate
kaivaśamu sēsukoṇṭē gānim’manunē
cēvaṭṭi nēm̐dīsitē cittagin̄ci vaccīm̐ gāni
vāvi yevvate ceppinā valapulu callunē

2.Voddanunna antavaḍi voḍam̐baḍi vuṇḍum̐gāni
buddiyevvate ceppinā napuḍē vinunē
tiddukoni bāsagoṇṭē diṣṭamugā niccum̐gāni
baddu levvatāḍin̄cinām̐ balumāru nāḍunē

3.Sarasamulāḍitēnu canaviccum̐ gāni vērē
taruṇi kām̐gilin̄citē dakkivuṇḍunē
yiravai śrīvēṅkaṭēśum̐ḍiṭu tānē nannu gūm̐ḍe
yeravula vārinellā nenasī nenayam̐ḍē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.