Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1401 | Keerthana 4 , Volume 24
Pallavi: Amta Sigguvadakuve Ativa (అంత సిగ్గువడకువే అతివ)
ARO: Pending
AVA: Pending
Ragam: Ramakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంత సిగ్గువడకువే అతివ నీవు
పంతమునఁ దెలియవే పాయమెల్ల గడువు ॥ పల్లవి ॥
గొంది నొక్కసింహమట కొండలు మోచినదట
ఇందుముఖులనడుమె యిరవట
కందువ యీ పొడుపుడుఁగత యిది నీవు నాకు
అందముగ నానతీవే ఆరునెల్ల గడువు ॥ అంత ॥
మొగి నొక్కక తామరలో మోవిపండు పండెనట
జిగిఁదేనె వావాతఁ జిందెనట
మగువ యీయారచి మతి నీవు దెలియవే
తొగరు నీపలుకుల తుదదాకా గడువు ॥ అంత ॥
కంతునిగురుతు రెండుగంబములమేడట
దొంతివలపులసిరి దొలఁకునట
ఇంతి నేను శ్రీవేంకటేశుడ యీకత
మంతనాన నిన్నుఁ గూడి మరపించేగడువు ॥ అంత ॥
Pallavi
Anta sigguvaḍakuvē ativa nīvu
pantamunam̐ deliyavē pāyamella gaḍuvu
Charanams
1.Gondi nokkasinhamaṭa koṇḍalu mōcinadaṭa
indumukhulanaḍume yiravaṭa
kanduva yī poḍupuḍum̐gata yidi nīvu nāku
andamuga nānatīvē ārunella gaḍuvu
2.Mogi nokkaka tāmaralō mōvipaṇḍu paṇḍenaṭa
jigim̐dēne vāvātam̐ jindenaṭa
maguva yīyāraci mati nīvu deliyavē
togaru nīpalukula tudadākā gaḍuvu
3.Kantunigurutu reṇḍugambamulamēḍaṭa
dontivalapulasiri dolam̐kunaṭa
inti nēnu śrīvēṅkaṭēśuḍa yīkata
mantanāna ninnum̐ gūḍi marapin̄cēgaḍuvu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.