Main Menu

Anatiyyavayya Amduku (ఆనతియ్యవయ్యా ఆందుకు )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1171 | Keerthana 360 , Volume 21

Pallavi:Anatiyyavayya Amduku (ఆనతియ్యవయ్యా ఆందుకు )
ARO: Pending
AVA: Pending

Ragam: Amarasindhu
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యవయ్యా అందుకు మాఁటెఱుఁగుదు
పూని అందరిని నీకుఁ బొందుసేసేను    ॥ పల్లవి ॥

వసివాడు మోముతోడ వంచుకొనేవు శిరసు
దెసల నెవ్వతెయైనాఁ దిట్టదుగదా
అసురుసురౌతాను అలసేవు పలుమారు
పిసికి ని న్నెవ్వతైనాఁ బిప్పిసేసెనో     ॥ ఆన ॥

వుడుకుఁ జెమటతోడ నొరగేవు మలగుపై
కడనెవ్వతైనా నలుగదుగదా
చిడుముడితోఁ గొంత చిన్నఁబోయివున్నాఁడవు
పడఁతి యెవ్వ తెయైనాఁ బంతమాడెనో  ॥ ఆన ॥

నిండుఁగళలతోడుత నివ్వెరగైనాఁడవు
అండనెవ్వతైనా మర్మా లంటదు గదా
దండిగా శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి
చండిపెట్టి యెవ్వతైనా సారెకు బోధించెనో ॥ ఆన ॥

Pallavi

Ānatiyyavayyā anduku mām̐ṭeṟum̐gudu
pūni andarini nīkum̐ bondusēsēnu

Charanams

1.Vasivāḍu mōmutōḍa van̄cukonēvu śirasu
desala nevvateyainām̐ diṭṭadugadā
asurusurautānu alasēvu palumāru
pisiki ni nnevvatainām̐ bippisēsenō

2.Vuḍukum̐ jemaṭatōḍa noragēvu malagupai
kaḍanevvatainā nalugadugadā
ciḍumuḍitōm̐ gonta cinnam̐bōyivunnām̐ḍavu
paḍam̐ti yevva teyainām̐ bantamāḍenō

3.Niṇḍum̐gaḷalatōḍuta nivveragainām̐ḍavu
aṇḍanevvatainā marmā laṇṭadu gadā
daṇḍigā śrīvēṅkaṭēśa taga nannu nēlitivi
caṇḍipeṭṭi yevvatainā sāreku bōdhin̄cenō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.