Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 111 | Keerthana 64 , Volume 2
Pallavi: Annitiki Noda (అన్నిటికి నొడ)
ARO: Pending
AVA: Pending
Ragam: Sriragam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
అన్నిటికి నొడయఁడవై న శ్రీపతివి నీవు
యెన్నరాదు మా బలఁగఁ మెంచుకో మా పౌఁజు ॥పల్లవి॥
జ్ఞానంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపు కామక్రోధాల వర్గము లారు
యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు ॥అన్ని॥
తప్పనిగుణాలు మూఁడు తనువికారము లారు
అప్పటి మనోబుద్ధ్యహంకారాలు
వుప్పతిల్లు విషయము లుడివోని వొకఅయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌఁజు ॥అన్ని॥
ఆఁకలిదప్పియును మానావమానములను
సోఁకిన శీతోష్ణాలు సుఖదుఃఖాలు
మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేఁకటారఁ గడపేవా నెంచుకో మాపౌఁజు ॥అన్ని॥
Pallavi
అన్నిటికి నొడయడవైనశ్రీపతివి నీవు
యెన్నరాదు మాబలగ మెంచుకో మాపౌజు
Charanams
1.జ్ౙానేంద్రియము లైదు శరీరిలోపల
ఆనక కర్మేంద్రియము లైదు
తానకపుకామక్రోధాలవర్గము లారు
యీనెలవు పంచభూతాలెంచు మాపౌజు
2.తప్పనిగుణాలు మూడు తనువికారము లారు
అప్పటి మనోబుద్ధ్యహంకారాలు
వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు
యిప్పటి మించేకోపము యెంచుకో మాపౌజు
3.ఆకలి దప్పియును మానావమానములును
సోకినశీతోష్ణాలు సుఖదుహ్ఖాలు
మూకగమికాడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
యేకటార గడపేవా నెంచుకో మాపౌజు
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.