Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1267 | Keerthana 400 , Volume 22
Pallavi: Anniyu Danaku Naaku (అన్నియు దనకు నాకు)
ARO: Pending
AVA: Pending
Ragam: Nilambari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నియుఁ దనకు నాకు నమరియున్నవి నేఁడు
యెన్నికల కెక్కెఁ బతి నీడకు రమ్మనవే ॥ పల్లవి ॥
చనవుగలచోటను సరసము చవులౌను
మనసెనసినచోట మాట లింపౌను
ననుపులయినచోట నవ్వులు ప్రియములౌను
వినయముచూపేచొట వేడుకలౌఁ జేలిమి ॥ అన్ని ॥
కూడివున్నచోటను గుదిగొను వలపులు
వాడిక లబ్బిన చోట వసమౌ రతి
పాడి నెరపేటిచోట పంతములు సమకూరు
యీడైవుండినచొట హెచ్చుఁ దమకములు ॥ అన్ని ॥
సమ్మతియయినచోట సతమౌను కాఁపురము
నమ్మికైనచోటను నంటు లీడేరు
నెమ్మి శ్రీవేంకటేశుఁడు నే నలమేలుమంగను
వుమ్మడి నన్నేలె నిఁక నొనరు సంతోసము ॥ అన్ని ॥
Pallavi
Anniyum̐ danaku nāku namariyunnavi nēm̐ḍu
yennikala kekkem̐ bati nīḍaku ram’manavē
Charanams
1.Canavugalacōṭanu sarasamu cavulaunu
manasenasinacōṭa māṭa limpaunu
nanupulayinacōṭa navvulu priyamulaunu
vinayamucūpēcoṭa vēḍukalaum̐ jēlimi
2.Kūḍivunnacōṭanu gudigonu valapulu
vāḍika labbina cōṭa vasamau rati
pāḍi nerapēṭicōṭa pantamulu samakūru
yīḍaivuṇḍinacoṭa heccum̐ damakamulu
3.Sam’matiyayinacōṭa satamaunu kām̐puramu
nam’mikainacōṭanu naṇṭu līḍēru
nem’mi śrīvēṅkaṭēśum̐ḍu nē nalamēlumaṅganu
vum’maḍi nannēle nim̐ka nonaru santōsamu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.