Main Menu

Amganaku Virahame (అంగనకు విరహమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1181 | Keerthana 415 , Volume 21

Pallavi: Amganaku Virahame (అంగనకు విరహమే)
ARO: Pending
AVA: Pending

Ragam:Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా    ॥ పల్లవి ॥

కలికి నిన్నుఁ దలఁచి గక్కున లోలోఁ గరఁగి
జలజలఁ జెమరించి జలకమాడె
బలుతమకాన నీకుఁ బక్కన నెదురువచ్చి
నిలువునఁ గొప్పువీడి నీలిచీర గప్పెను    ॥ అంగ ॥

సుదతి నిన్నుఁ జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాఁకాఁ బూసె గంధము
మదనమంత్రములైనమాటల మర్మము సోఁకి
ముదురుఁబులకలను ముత్యాలు గట్టెను    ॥ అంగ ॥

గక్కన గాఁగిట నిన్నుఁ గలసి యీమానిని
చొక్కి చంద్రాభరణపుసొమ్ములు వెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలఁబాలు వోసెను    ॥ అంగ ॥


Pallavi

Aṅganaku virahamē siṅgāramāya
ceṅgaṭa nīvē yidi cittagin̄cavayyā

Charanams

1.Kaliki ninnum̐ dalam̐ci gakkuna lōlōm̐ garam̐gi
jalajalam̐ jemarin̄ci jalakamāḍe
balutamakāna nīkum̐ bakkana neduruvacci
niluvunam̐ goppuvīḍi nīlicīra gappenu

2.Sudati ninnum̐ jūci sōyagapusiggulanu
podali cekkuladām̐kām̐ būse gandhamu
madanamantramulainamāṭala marmamu sōm̐ki
mudurum̐bulakalanu mutyālu gaṭṭenu

3.Gakkana gām̐giṭa ninnum̐ galasi yīmānini
cokki candrābharaṇapusom’mulu veṭṭe
akkuna śrīvēṅkaṭēśa alamēlumaṅga nīku
dakki sarasamulanu talam̐bālu vōsenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.