Main Menu

Amta Kopitene Mammu Natte (అంత కోపితేనే మమ్ము నట్టె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1414 | Keerthana 84 , Volume 24

Pallavi: Amta Kopitene Mammu Natte (అంత కోపితేనే మమ్ము నట్టె)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత కోపితేనే మమ్ము నట్టె నగుమీ
చెంత నీవు చెనకిన చెనకక మానము      ॥ పల్లవి ॥

వొక్కటంటే రెండనక వుండుదురా యెవ్వరైనా
మక్కవ ముందర చూచి మాటాడరా
యెక్కువైనదొరవైతే యేలుదుగాని భూమెల్ల
చక్కనిమావద్దనుంటే జరయకమానము    ॥ అంత ॥

మెఱిచిన నుఱుమక మిన్నైన నుండదట
గుఱి నీచేఁతలు చూచి కోపము రాదా
నెఱజాణవైతే నీకునీవే వుండేవుగాని
నెఱయ సరికిబేశౌ నిలువకమానము      ॥ అంత ॥

ముయికి ముయి వెట్టేది మున్నిటివారితగవు
నియతి నీవు మెచ్చిన నేను మెచ్చితి
ప్రియుఁడ శ్రీవేంకటేశ పెంపునఁ గూడితి నన్ను
నయమున గుఱుతులు నాటించకమానము   ॥ అంత ॥


Pallavi

Anta kōpitēnē mam’mu naṭṭe nagumī
centa nīvu cenakina cenakaka mānamu

Charanams

1.Vokkaṭaṇṭē reṇḍanaka vuṇḍudurā yevvarainā
makkava mundara cūci māṭāḍarā
yekkuvainadoravaitē yēludugāni bhūmella
cakkanimāvaddanuṇṭē jarayakamānamu

2.Meṟicina nuṟumaka minnaina nuṇḍadaṭa
guṟi nīcēm̐talu cūci kōpamu rādā
neṟajāṇavaitē nīkunīvē vuṇḍēvugāni
neṟaya sarikibēśau niluvakamānamu

3.Muyiki muyi veṭṭēdi munniṭivāritagavu
niyati nīvu meccina nēnu mecciti
priyum̐ḍa śrīvēṅkaṭēśa pempunam̐ gūḍiti nannu
nayamuna guṟutulu nāṭin̄cakamānamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.