Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 47 | Keerthana 288 , Volume 1
Pallavi:Akasa Maddama (ఆకాశ మడ్డమా)
ARO: Pending
AVA: Pending
Ragam: Bhupalam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా
శ్రీకాంతు భజియించు సేవకులకు ॥ పల్లవి ॥
పాతాళమడ్డమా బలిమథను దాసులకు
భూతలం బడ్డమా పుణ్యులకును
సేతు కైలాసములు చిరభూములిన్నియును
పై త్రోవలట పరమ భాగవతులకును ॥ ఆకాశ ॥
అమరావతమడ్డమా హరి దాసులకు మహా
తిమిరంబులడ్డమా దివ్యులకును
కమలాసనుని లోకంబదియు నడ్డమా
విమలాత్ములై వెలుఁగు విష్ణు దాసులకు ॥ ఆకాశ ॥
పరమపద మడ్డమా బ్రహ్మాండధరుఁడైన
ధర వేంకటేశ్వరుని దాసులకును
యిరవైన లోకముల నిన్నిటా భోగించి
వరుసలను విహరించు వరవైష్ణవులకు ॥ ఆకాశ ॥
Pallavi
Ākāśamaḍḍamā avvalayu naḍḍamā
śrīkāntu bhajiyin̄cu sēvakulaku
Charanams
1.Pātāḷamaḍḍamā balimathanu dāsulaku
bhūtalaṁ baḍḍamā puṇyulakunu
sētu kailāsamulu cirabhūmulinniyunu
pai trōvalaṭa parama bhāgavatulakunu
2.Amarāvatamaḍḍamā hari dāsulaku mahā
timirambulaḍḍamā divyulakunu
kamalāsanuni lōkambadiyu naḍḍamā
vimalātmulai velum̐gu viṣṇu dāsulaku
3.Paramapada maḍḍamā brahmāṇḍadharum̐ḍaina
dhara vēṅkaṭēśvaruni dāsulakunu
yiravaina lōkamula ninniṭā bhōgin̄ci
varusalanu viharin̄cu varavaiṣṇavulaku
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.