Main Menu

Alladivo Naayakuda Appudu (అల్లదివో నాయకుడ అప్పుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1425 | Keerthana 149 , Volume 24

Pallavi: Alladivo Naayakuda Appudu (అల్లదివో నాయకుడ అప్పుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లదివో నాయకుఁడ అప్పుడు నేఁ జెప్పినది
వొల్లనే వొయ్యారి బాగై నిలుచున్నది       ॥ పల్లవి ॥

కొండుకగుబ్బలమీఁద కుంకుమ పూసినది
అండనే వలిపయ్యద గప్పినది
మెండుగఁ గస్తురినామమె నుదటఁ బెట్టినది
కొండలరాయఁడ నీకు గురియై తానున్నది    ॥ అల్ల ॥

చిప్పిలు నిలువుఁ గొప్పున సేసవిరులది
కప్పురవిడేలఁ గన్నుల నవ్వేటిది
వుప్పతిల్లు సొమ్ములతో నొరపుమించినది
అప్పఁడ నీచేఁతలకు నందమై తా నున్నది    ॥ అల్ల ॥

చేపల నిన్ను దగ్గరి చెఱఁగు వట్టినది
యీవల నీభావమెల్ల వింతగాఁ జేసినది
శ్రీవేంకటేశుఁడ నీచిత్తము వట్టినది
సావితో నీరతులలలో సదమదమైనది       ॥ అల్ల ॥

Pallavi

Alladivō nāyakum̐ḍa appuḍu nēm̐ jeppinadi
vollanē voyyāri bāgai nilucunnadi

Charanams

1.Koṇḍukagubbalamīm̐da kuṅkuma pūsinadi
aṇḍanē valipayyada gappinadi
meṇḍugam̐ gasturināmame nudaṭam̐ beṭṭinadi
koṇḍalarāyam̐ḍa nīku guriyai tānunnadi

2.Cippilu niluvum̐ goppuna sēsaviruladi
kappuraviḍēlam̐ gannula navvēṭidi
vuppatillu som’mulatō norapumin̄cinadi
appam̐ḍa nīcēm̐talaku nandamai tā nunnadi

3.Cēpala ninnu daggari ceṟam̐gu vaṭṭinadi
yīvala nībhāvamella vintagām̐ jēsinadi
śrīvēṅkaṭēśum̐ḍa nīcittamu vaṭṭinadi
sāvitō nīratulalalō sadamadamainadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.