Main Menu

Anatiyyagadave (ఆనతియ్యగదవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1365 | Keerthana 388 , Volume 23

Pallavi:Anatiyyagadave (ఆనతియ్యగదవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Anatiyyagadave | ఆనతియ్యగదవే     
Voice: K Murali Krishna


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను
పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసుపేదను నేను  ॥ పల్లవి ॥

కొలిచేమనే బంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ
దెలిసేమనే జ్ఞానులు తెందేపలున్నారు
తలఁచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె
యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో      ॥ ఆన ॥

పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట
వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట
మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరట
వినయపు నామనవి సనవులకు వేళ లెపుడు గలిగీనో    ॥ ఆన ॥

వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు
అన్నిటాను నీకాఁగిటిలోపల నలరీ నలమేల్మంగ
యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలోనే
పన్నిన నా మొక్కులు నీ కేబాగులఁ జేరినో         ॥ ఆన ॥

Pallavi

Ānatiyyam̐gadavē andukē kācukunnām̐ḍanu
pūnuka nīventa nērparivainā bhuvi manasupēdanu nēnu

Charanams

1.Kolicēmanē baṇṭlu nīkum̐ gōṭānam̐gōṭlu galaru ninnum̐
delisēmanē jñānulu tendēpalunnāru
talam̐ci varamulaḍigēvāralu talaveṇṭrukalandaru vāre
yila sandaḍilō nākoluvu yeṭuvale nekkīnō

2.Panulakum̐ bālpaḍinavāru brahmādidēvatalaṭa
vinutulu sēyam̐ doḍaṅginave vēdarāsulaṭa
munukoni dhyānin̄cuvāru munulendarainām̐ galaraṭa
vinayapu nāmanavi sanavulaku vēḷa lepuḍu galigīnō

3.Vunnatitōḍuta ninnu mōm̐cuṭaku vunnāru garum̐ḍam̐ḍu śēṣum̐ḍu nīku
anniṭānu nīkām̐giṭilōpala nalarī nalamēlmaṅga
yennam̐ga śrīvēṅkaṭēśā nannunu yēliti vintaṭilōnē
pannina nā mokkulu nī kēbāgulam̐ jērinō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.