Main Menu

Adiye Kaadaa Satata Mataniki (అదియే కాదా సతత మాతనికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1430 | Keerthana 176 , Volume 24

Pallavi:Adiye Kaadaa Satata Mataniki (అదియే కాదా సతత మాతనికి)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియే కాదా సతత మాతనికి తన కిపుడు
పదియవస్థలఁ బొంగి భ్రమసేఁ గాక         ॥ పల్లవి ॥

పతిఁ బాసి విరహమున పానుపే పామనుచు
అతివ యల్లన లేచి అవలి కేఁగె
సతి యంతలోఁ గొలన జలకేలి కేఁగి యది
మతిఁ బొంగుజలధనుచు మారుమో మిడియ    ॥ అది ॥

తరుణి తామరయిల్లు తపనమండలమనుచు
అరమరచి కాఁకలనె యలసె నదివో
మరిగి మట్టెలరవము మంత్రశాస్త్రం బనుచు
వెరవెడలి తనలోనె వెరగందె నదివో       ॥ అది ॥

చెలియ దనకుచగిరులు శ్రీవేంకటాచలపు-
నిలువుశిఖరములనుచు నిధుల నిలిచె
వలచి శ్రీవేంకటేశ్వరుఁ డపుడు గూడఁగా
తలఁపులును దనువులును తారుకాణాయ     ॥ అది ॥

Pallavi

Adiyē kādā satata mātaniki tana kipuḍu
padiyavasthalam̐ boṅgi bhramasēm̐ gāka

Charanams

1.Patim̐ bāsi virahamuna pānupē pāmanucu
ativa yallana lēci avali kēm̐ge
sati yantalōm̐ golana jalakēli kēm̐gi yadi
matim̐ boṅgujaladhanucu mārumō miḍiya

2.Taruṇi tāmarayillu tapanamaṇḍalamanucu
aramaraci kām̐kalane yalase nadivō
marigi maṭṭelaravamu mantraśāstraṁ banucu
veraveḍali tanalōne veragande nadivō

3.Celiya danakucagirulu śrīvēṅkaṭācalapu-
niluvuśikharamulanucu nidhula nilice
valaci śrīvēṅkaṭēśvarum̐ ḍapuḍu gūḍam̐gā
talam̐pulunu danuvulunu tārukāṇāya


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.