Main Menu

Andukepo Ninnu Tooranaaditi (అందుకేపో నిన్ను తూరనాడితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1618 | Keerthana 103 , Volume 26

Pallavi: Andukepo Ninnu Tooranaaditi (అందుకేపో నిన్ను తూరనాడితి)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో నిన్ను తూరనాడితి మిందరిలోనా
ఇందుముఖి భావ మిది ఇఁకను నీ చిత్తము    ॥ పల్లవి ॥

చిత్తము నీపై నిలిపి చెలితో ముచ్చట చెప్పి
తత్తరించి తనమాఁట తా మరచె
కొత్తగా మోవిని నవ్వి కోపమే బొమ్మల నించి
చిత్తరు పతిమవలె చేఁతలెల్లా మరచె      ॥ అందు ॥

చెప్పినసుద్దులే చెప్పీ సేసినచేఁతలే సేసి
అప్ప డేమంటినోయని అడిగీఁదానె
రెప్పల తుదల సిగ్గు రేసులై నిట్టూర్పులను
దప్పిదేరేమేనితోడ తడఁబాటుఁ బొందెను    ॥ అందు ॥

అంతలోనే నిన్నుఁ జూచి అంగన కన్నీరు నించి
పంతపుఁ కారిమితో నీపై నొరగెను
ఇంతసేసె కూడితివి ఇప్పుడే శ్రీవేంకటేశ
వింతగాఁ గళలఁ జొక్కి వేడుక నలసెను     ॥ అందు ॥


Pallavi

Andukē pō ninnu tūranāḍiti mindarilōnā
indumukhi bhāva midi im̐kanu nī cittamu

Charanams

1.Cittamu nīpai nilipi celitō muccaṭa ceppi
tattarin̄ci tanamām̐ṭa tā marace
kottagā mōvini navvi kōpamē bom’mala nin̄ci
cittaru patimavale cēm̐talellā marace

2.Ceppinasuddulē ceppī sēsinacēm̐talē sēsi
appa ḍēmaṇṭinōyani aḍigīm̐dāne
reppala tudala siggu rēsulai niṭṭūrpulanu
dappidērēmēnitōḍa taḍam̐bāṭum̐ bondenu

3.Antalōnē ninnum̐ jūci aṅgana kannīru nin̄ci
pantapum̐ kārimitō nīpai noragenu
intasēse kūḍitivi ippuḍē śrīvēṅkaṭēśa
vintagām̐ gaḷalam̐ jokki vēḍuka nalasenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.