Main Menu

Anta Mammu Jenakaku (అంత మమ్ము జెనకకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1623 | Keerthana 135, Volume 26

Pallavi:Anta Mammu Jenakaku (అంత మమ్ము జెనకకు)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత మమ్ముఁ జెనకకు మందుకేమి
ఇంత నీతోఁ జెప్పనేల ఇప్పు డందుకేమి ॥ పల్లవి ॥

వాములుగా బొంకనేర వట్టివంతా లాడనేర
ఆమాటే మఱవకు మందుకేమే
నీ మచ్చము లెంచ రాము నిన్నుఁ దడవఁగరాము
ఆముకొని మమ్ము నవ్వే వందుకేమి    ॥ అంత ॥

తప్పులు వట్టఁగనేల తారుకాణించఁగనేల
అప్పుడే చెప్పేఁగాని అందుకేమి
రెప్పలెత్తి చూడవద్దు రేసులు పుట్టించవద్దు
చప్పఁ జేసేవు వలపు సారె నందుకేమి   ॥ అంత ॥

కొంగువట్టి తియ్యలేదు కూరిమి గొసరలేదు
అంగవించి కాఁగిలించే వందుకేమి
రంగగు శ్రీవేంకటేశ రవ్వసేయ నిఁకనేల
యెంగిలి సేసితి మోవి యిఁక నందుకేమి ॥ అంత ॥

Pallavi

Anta mam’mum̐ jenakaku mandukēmi
inta nītōm̐ jeppanēla ippu ḍandukēmi

Charanams

1.Vāmulugā boṅkanēra vaṭṭivantā lāḍanēra
āmāṭē maṟavaku mandukēmē
nī maccamu len̄ca rāmu ninnum̐ daḍavam̐garāmu
āmukoni mam’mu navvē vandukēmi

2.Tappulu vaṭṭam̐ganēla tārukāṇin̄cam̐ganēla
appuḍē ceppēm̐gāni andukēmi
reppaletti cūḍavaddu rēsulu puṭṭin̄cavaddu
cappam̐ jēsēvu valapu sāre nandukēmi

3.Koṅguvaṭṭi tiyyalēdu kūrimi gosaralēdu
aṅgavin̄ci kām̐gilin̄cē vandukēmi
raṅgagu śrīvēṅkaṭēśa ravvasēya nim̐kanēla
yeṅgili sēsiti mōvi yim̐ka nandukēmi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.