Main Menu

Anduke Taa Negguvattee (అందుకే తా నెగ్గువట్టీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1625 | Keerthana 145 , Volume 26

Pallavi: Anduke Taa Negguvattee (అందుకే తా నెగ్గువట్టీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Palavanjaram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే తా నెగ్గువట్టీ నంతేకాక
పొందిన పతికి మీరే బుద్ది చెప్పరమ్మా     ॥ పల్లవి ॥

కోపగించితినటనే కొంగవట్టి తియ్యఁగాను
వోపనంటాఁ బెనఁగితి నూరకే నేను
పైపైఁ దిట్టితినటే వచ్చిమాట లాడఁగాను
కోపులఁ బెదవులనే గొణఁగితిఁ గాక        ॥ అందు ॥

కైకోనటవే నేను గబ్బితనాల నుండఁగ
ఆకడ నే నవ్వలి మోమైతిఁ గాక
జోకఁ దాఁ బిలిచినట్టి చోటికి రానటే నేను
యేకతానఁ దా నుండఁగా ఇంట నుంటిఁగాక   ॥ అందు ॥

కూడివుండనటే నేను గొబ్బున నుమ్మగించఁగా
వాడు వాకిటికేఁగి వంతనుంటిని
వేడుక శ్రీవేంకటాద్రివిభుఁడు నన్నిటు గూడె
పాడిపంతా లెఱఁగనా భ్రమసితిఁ గాక     ॥ అందు ॥


Pallavi

Andukē tā negguvaṭṭī nantēkāka
pondina patiki mīrē buddi cepparam’mā

Charanams

1.Kōpagin̄citinaṭanē koṅgavaṭṭi tiyyam̐gānu
vōpanaṇṭām̐ benam̐giti nūrakē nēnu
paipaim̐ diṭṭitinaṭē vaccimāṭa lāḍam̐gānu
kōpulam̐ bedavulanē goṇam̐gitim̐ gāka

2.Kaikōnaṭavē nēnu gabbitanāla nuṇḍam̐ga
ākaḍa nē navvali mōmaitim̐ gāka
jōkam̐ dām̐ bilicinaṭṭi cōṭiki rānaṭē nēnu
yēkatānam̐ dā nuṇḍam̐gā iṇṭa nuṇṭim̐gāka

3.Kūḍivuṇḍanaṭē nēnu gobbuna num’magin̄cam̐gā
vāḍu vākiṭikēm̐gi vantanuṇṭini
vēḍuka śrīvēṅkaṭādrivibhum̐ḍu nanniṭu gūḍe
pāḍipantā leṟam̐ganā bhramasitim̐ gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.