Main Menu

Adiye Vishnupadamu (అదియే విష్ణుపదము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 180 | Keerthana 402 , Volume 2

Pallavi:Adiye Vishnupadamu (అదియే విష్ణుపదము)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదియే విష్ణుపదము ఆతుమకు నెలవు
అదే జననకారణ మాకాశపదము        ॥ పల్లవి ॥

మంచిమాఁటలైనాఁ గానిమాటలైన నొకచోట
ముంచిముంచి యాకాశముననే యణఁగును
యెంచరాని నిట్టూర్పు లెన్ని వొడమినాను
అంచల నణఁగిపోవు నాకాశమును       ॥ అది ॥

చూపులెంత దవ్వైనా సూర్యచంద్రులఁ దాఁకి
ఆపొంతనే యణఁగు నాకాశమునను
రూపుల మైనీడలును రుచులఁ గాలత్రయము
పైపైనే యణఁగును బహిరాకాశమున     ॥ అది ॥

యిలఁ జీఁకటి వెలుఁగు యెండ నహోరాత్రాలఁ
గలసి మెలఁగు నాకాశతత్వమున
చలువై శ్రీవేంకటేశు సాకారనిరాకారా-
లలరి వెలుఁగుచుండు నంతరాకాశమున   ॥ అది ॥

Pallavi

Adiyē viṣṇupadamu ātumaku nelavu
adē jananakāraṇa mākāśapadamu

Charanams

1.Man̄cimām̐ṭalainām̐ gānimāṭalaina nokacōṭa
mun̄cimun̄ci yākāśamunanē yaṇam̐gunu
yen̄carāni niṭṭūrpu lenni voḍaminānu
an̄cala naṇam̐gipōvu nākāśamunu

2.Cūpulenta davvainā sūryacandrulam̐ dām̐ki
āpontanē yaṇam̐gu nākāśamunanu
rūpula mainīḍalunu ruculam̐ gālatrayamu
paipainē yaṇam̐gunu bahirākāśamuna

3.Yilam̐ jīm̐kaṭi velum̐gu yeṇḍa nahōrātrālam̐
galasi melam̐gu nākāśatatvamuna
caluvai śrīvēṅkaṭēśu sākāranirākārā-
lalari velum̐gucuṇḍu nantarākāśamuna


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.