Main Menu

Annitaa Jaanada Vaite Voduvugaani (అన్నిటా జాణడ వైతే వౌదువుగాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1646 | Keerthana 273 , Volume 26

Pallavi: Annitaa Jaanada Vaite Voduvugaani (అన్నిటా జాణడ వైతే వౌదువుగాని)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా జాణఁడ వైతే నౌదువుగాని
కన్నచోటనెల్లాను కాంతను దూరకుమీ  ॥ పల్లవి ॥

పంతములేలాడేవుఁ బయలేలీదించేవు
యింతేసికి నోపునా యీపె నీతోను
చెంత మోము వంచుకొని సిగ్గుపడి నున్న నింతే
జంతల నాడినయట్టు సకియ నాడకుమీ ॥ అన్ని ॥

వేసాలేల సేసేవు వెగ్గళించేల నవ్వేవు
గాసిఁబెట్టితే నోర్చునా కిమిని గోల
మూసినముత్తెమువలె మోసమున నున్న దింతే
యీసడపువారివలె నీకె నెంచకుమీ     ॥ అన్ని॥

జాగులేల సేసేవు చలముల సాదించేవు
యీగతి నలమేల్మంగ యిచ్చగించునా
బాగుగా శ్రీవేంకటేశ బత్తితోఁ గూడె నింతె
భోగపు టింతులవలె పొలఁతిఁ జేయకుమీ ॥ అన్ని॥

Pallavi

Anniṭā jāṇam̐ḍa vaitē nauduvugāni
kannacōṭanellānu kāntanu dūrakumī

Charanams

1.Pantamulēlāḍēvum̐ bayalēlīdin̄cēvu
yintēsiki nōpunā yīpe nītōnu
centa mōmu van̄cukoni siggupaḍi nunna nintē
jantala nāḍinayaṭṭu sakiya nāḍakumī

2.Vēsālēla sēsēvu veggaḷin̄cēla navvēvu
gāsim̐beṭṭitē nōrcunā kimini gōla
mūsinamuttemuvale mōsamuna nunna dintē
yīsaḍapuvārivale nīke nen̄cakumī

3.Jāgulēla sēsēvu calamula sādin̄cēvu
yīgati nalamēlmaṅga yiccagin̄cunā
bāgugā śrīvēṅkaṭēśa battitōm̐ gūḍe ninte
bhōgapu ṭintulavale polam̐tim̐ jēyakumī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.