Main Menu

Adugare Aatanine Avunokaado (అడుగరే ఆతనినే అవునోకాదో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1653 | Keerthana 313 , Volume 26

Pallavi: Adugare Aatanine Avunokaado (అడుగరే ఆతనినే అవునోకాదో)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే ఆతనినే అవునోకాదో
వెడ వెడ మాటలెల్లా వేడుకలౌనా     ॥ పల్లవి ॥

మనసురానిచోట మగుడి మగుడి వచ్చి
చనవులు నెరపితే సంగతులౌనా
పెనఁగుతా నుండఁగాను ప్రియములు పచారించి
చెనకఁబోతేఁ దనకు చేతికి లోనౌదురా    ॥ అడు ॥

చలము సాదించేలేళ చవులు సేసుకొని
పిలిచి విందుచెప్పితే ప్రియము లౌనా
వలపు చాలకుండఁగా వడివెట్టి వడివెట్టి
బలిమిఁ గాఁగిలించెతే బత్తి సేతురా      ॥ అడు ॥

సిగ్గువడివుండఁగాను చెక్కునొక్కి వేఁడుకొని
వొగ్గి విడెమిచ్చితు వొడఁబాటౌనా
అగ్గమై శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను
కగ్గులేక కూడె నిఁకఁ గపటము లెంతురా    ॥ అడు ॥

Pallavi

Aḍugarē ātaninē avunōkādō
veḍa veḍa māṭalellā vēḍukalaunā

Charanams

1.Manasurānicōṭa maguḍi maguḍi vacci
canavulu nerapitē saṅgatulaunā
penam̐gutā nuṇḍam̐gānu priyamulu pacārin̄ci
cenakam̐bōtēm̐ danaku cētiki lōnaudurā

2.Calamu sādin̄cēlēḷa cavulu sēsukoni
pilici vinduceppitē priyamu launā
valapu cālakuṇḍam̐gā vaḍiveṭṭi vaḍiveṭṭi
balimim̐ gām̐gilin̄cetē batti sēturā

3.Sigguvaḍivuṇḍam̐gānu cekkunokki vēm̐ḍukoni
voggi viḍemiccitu voḍam̐bāṭaunā
aggamai śrīvēṅkaṭēśum̐ ḍalamēlmaṅganu nēnu
kaggulēka kūḍe nim̐kam̐ gapaṭamu lenturā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.