Pallavi
|| అందరి బ్రదుకులు నాతనివే | కందువెల్ల శ్రీకాంతునిదే ||
Charanams
|| వేమరు జదివెడి విప్రుల వేదము | సోమకవైరి యశో విభవం |
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు- | ధామ ధనుని సంతత కరుణే ||
|| హితవగు నిలలో నీసుఖమెల్లను | దితి సుత దమనుడు దెచ్చినదే |
తతి తల్లి దండ్రి తానై కాచిన | రతి ప్రహ్లాద వరదుని కృపే ||
|| అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు | బలి బంధను కృప బరగినవే ||
బలసి మునుల యాపదలు వాపుటకు | బలునృప భంజను పరిణతలే ||
|| పూని యనాథుల పొందుగ గాచిన | జానకీ విభుని సరసతలే |
నానా భూభరణంబులు నందుని | సూనుడు చేసిన సుకృతములే ||
|| తలకొని ధర్మము తానై నిలుపుట | కలుష విదూరుని గర్వములే |
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు | కలియుగమున వేంకటపతివే ||
.
Pallavi
|| aMdari bradukulu nAtanivE | kaMduvella SrIkAMtunidE ||
Charanams
|| vEmaru jadiveDi viprula vEdamu | sOmakavairi yaSO viBavaM |
SrImiMcu namarula jIvanamella su- | dhAma dhanuni saMtata karuNE ||
|| hitavagu nilalO nIsuKamellanu | diti suta damanuDu deccinadE |
tati talli daMDri tAnai kAcina | rati prahlAda varaduni kRupE ||
|| alarina yamarEMdrAdula bradukulu | bali baMdhanu kRupa baraginavE || balasi munula yApadalu vApuTaku | balunRupa BaMjanu pariNatalE ||
|| pUni yanAthula poMduga gAcina | jAnakI viBuni sarasatalE |
nAnA BUBaraNaMbulu naMduni | sUnuDu cEsina sukRutamulE ||
|| talakoni dharmamu tAnai nilupuTa | kaluSha vidUruni garvamulE |
nilici lOkamulu nilipina GanuDagu | kaliyugamuna vEMkaTapativE ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.