Main Menu

Adivo Needevulu Neeyakkuva (అదివో నీదేవులు నీయక్కువ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1460 | Keerthana 355 , Volume 24

Pallavi:Adivo Needevulu Neeyakkuva (అదివో నీదేవులు నీయక్కువ)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదివో నీ దేవులు నీ యక్కునఁ జెలువొందీని
యెదుట నీకు నాపె ఇన్నిటాఁ దగును  ॥ పల్లవి ॥

భామ నీకు నేపొద్దు పరతంత్రము
అమనిరతులలో మోహనయంత్రము
దామెనపలుకుల మదనయంత్రము
సాముసేసేనీకాఁగిటి స్వతంత్రము    ॥ అది ॥

నెలకొన్న నీకు మాణిక్యము
పొలసేచూపులకెల్లా పుష్పచాపము
కలిగె నీకింతటి శ్రింగారరూపము
యిల నీమహిమ వెలయించేప్రతాపము ॥ అది ॥

తన్నుదానే నీకును చిత్తరంజనము
నిన్నుఁ గూడేకళలతో నిరంజనము
యెన్పఁగ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చెన్నగు నీవనేటినిక్షేపాన కంజనము   ॥ అది ॥

Pallavi

Adivō nī dēvulu nī yakkunam̐ jeluvondīni
yeduṭa nīku nāpe inniṭām̐ dagunu

Charanams

1.Bhāma nīku nēpoddu paratantramu
amaniratulalō mōhanayantramu
dāmenapalukula madanayantramu
sāmusēsēnīkām̐giṭi svatantramu

2.Nelakonna nīku māṇikyamu
polasēcūpulakellā puṣpacāpamu
kalige nīkintaṭi śriṅgārarūpamu
yila nīmahima velayin̄cēpratāpamu

3.Tannudānē nīkunu cittaran̄janamu
ninnum̐ gūḍēkaḷalatō niran̄janamu
yenpam̐ga śrīvēṅkaṭēśa yīke yalamēlumaṅga
cennagu nīvanēṭinikṣēpāna kan̄janamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.