Main Menu

Amduke Talladamamdee (అందుకే తల్లడమందీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1675 | Keerthana 446 , Volume 26

Pallavi: Amduke Talladamamdee (అందుకే తల్లడమందీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే తల్లడిమందీ నంతరంగము
వొందిలినే పవ్వళించివున్నాడు లోనను    ॥ పల్లవి ॥

పెనఁగ నే నోపనంటి బిగిసినదానఁగాను
మనసున నెట్టుండెనొ మగనికిని
వినయాన మీరైనా విన్నవించరే చెలులు
వొనరఁగఁ జిన్నఁ బోయివున్నాఁడు లోనను   ॥ అందు ॥

అట్టెరా సిగ్గువతితి నలిగినదానఁగాను
యెట్టని యాడుకొనునో ఇందరితోను
గుట్టుతో నీతని వేఁడుకొని సారెకు మొక్కరే
వొట్టుకొన్నచింతతోడ నున్నాఁడు లోనను   ॥ అందు ॥

సరిఁ గాఁగిటఁ గూడితి చలపాదిదానఁగాను
ఇరవై శ్రీవేంకటేశు కెద్ది ప్రియమో
పరగఁ దనకు నిట్టె పంతమీయరే మీరు
వొరసి తా నవ్వుకొంటా నున్నాఁడు లోనను   ॥ అందు ॥


Pallavi

Andukē tallaḍimandī nantaraṅgamu
vondilinē pavvaḷin̄civunnāḍu lōnanu

Charanams

1.Penam̐ga nē nōpanaṇṭi bigisinadānam̐gānu
manasuna neṭṭuṇḍeno maganikini
vinayāna mīrainā vinnavin̄carē celulu
vonaram̐gam̐ jinnam̐ bōyivunnām̐ḍu lōnanu

2.Aṭṭerā sigguvatiti naliginadānam̐gānu
yeṭṭani yāḍukonunō indaritōnu
guṭṭutō nītani vēm̐ḍukoni sāreku mokkarē
voṭṭukonnacintatōḍa nunnām̐ḍu lōnanu

3.Sarim̐ gām̐giṭam̐ gūḍiti calapādidānam̐gānu
iravai śrīvēṅkaṭēśu keddi priyamō
paragam̐ danaku niṭṭe pantamīyarē mīru
vorasi tā navvukoṇṭā nunnām̐ḍu lōnanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.