Main Menu

Amdulone Kaanavachchee Nannipanulu (అందులోనే కానవచ్చీ నన్నిపనులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 830 | Keerthana 175 , Volume 18

Pallavi: Amdulone Kaanavachchee Nannipanulu (అందులోనే కానవచ్చీ నన్నిపనులు)
ARO: Pending
AVA: Pending

Ragam: Gujjari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే కానవచ్చె నన్నిపనులు
మందలించి యాపెతోడిమాటలు మానుమా    ॥ పల్లవి ॥

మనసిచ్చి నీవు నన్ను మన్నించేవాఁడవైతే
ననిచిన యాకెతోడ నవ్వకుండుమా
యొనసి యేపొద్దూ నన్ను నెడయనివాఁడవైతే
పొనిఁగి యాపెయింటికిఁ బోక ఇట్టె వుండుమా   ॥ అందు ॥

చేకొని నాచెప్పినట్టు సేసేటివాఁడవైతే
జోకలుగా నాపెదిక్కు చూడకుండుమా
నాకిచ్చినబాసతోడ నమ్మించినవాఁడవైతే
దాకోని యాపెపొందులు తలచక వుండుమా    ॥ అందు ॥

మిక్కిలి నామీదను మేలుగలవాఁడవైతే
అక్కరతో నాపెకాని కందకుండుమా
యిక్కడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అక్కున నన్నుఁ బెట్టితి వాకె నంటకుండుమా   ॥ అందు ॥


Pallavi

Andulōnē kānavacce nannipanulu
mandalin̄ci yāpetōḍimāṭalu mānumā

Charanams

1.Manasicci nīvu nannu mannin̄cēvām̐ḍavaitē
nanicina yāketōḍa navvakuṇḍumā
yonasi yēpoddū nannu neḍayanivām̐ḍavaitē
ponim̐gi yāpeyiṇṭikim̐ bōka iṭṭe vuṇḍumā

2.Cēkoni nāceppinaṭṭu sēsēṭivām̐ḍavaitē
jōkalugā nāpedikku cūḍakuṇḍumā
nākiccinabāsatōḍa nam’min̄cinavām̐ḍavaitē
dākōni yāpepondulu talacaka vuṇḍumā

3.Mikkili nāmīdanu mēlugalavām̐ḍavaitē
akkaratō nāpekāni kandakuṇḍumā
yikkaḍa śrīvēṅkaṭēśa yē nalamēlumaṅganu
akkuna nannum̐ beṭṭiti vāke naṇṭakuṇḍumā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.