Main Menu

Anniyu Nee Verugudu (అన్నియు నీ వెఱుఁగుదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1060 | Keerthana 355 , Volume 20

Pallavi: Anniyu Nee Verugudu (అన్నియు నీ వెఱుఁగుదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Riti Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నీ వెఱుఁగుదు వద్దమాడ నే నీకు
మన్నించ నేరుతువు మారుమాట లేఁటికి  ॥ పల్లవి ॥

సేసవెట్టి నీవు నాపై చెలిమిసేసినట్టి-
వాసులకే పెనఁగేను వద్ద నుండి
సేసుకొన్న మగఁడవు చిత్తముకొలఁది ఇఁక
రాసికెక్కె నాపంతము రవ్వసేయనేఁటికి  ॥ అన్ని ॥

కన్నులఁ జూచి నాతో కవకవ నవ్వినట్టి-
సన్నలకే పిలిచేను సారె సారెకు
యిన్నేసి నమ్మిక లిచ్చి తెటువలసినఁ జేయు
వన్నె వచ్చె నారతికి వంకలొత్తనేఁటికి   ॥ అన్ని ॥

కందువకుఁ దీసి నన్ను కాఁగిలించి కూడినట్టి-
అందాలకే తగిలేను అప్పటనుండి
పొందిన శ్రీ వేంకటేశ భువి నీకృప నించితిఁ
వందమాయ నాజన్మము అలయించనేఁటికి ॥ అన్ని ॥

Pallavi

Anniyu nī veṟum̐gudu vaddamāḍa nē nīku
mannin̄ca nērutuvu mārumāṭa lēm̐ṭiki

Charanams

1.Sēsaveṭṭi nīvu nāpai celimisēsinaṭṭi-
vāsulakē penam̐gēnu vadda nuṇḍi
sēsukonna magam̐ḍavu cittamukolam̐di im̐ka
rāsikekke nāpantamu ravvasēyanēm̐ṭiki

2.Kannulam̐ jūci nātō kavakava navvinaṭṭi-
sannalakē pilicēnu sāre sāreku
yinnēsi nam’mika licci teṭuvalasinam̐ jēyu
vanne vacce nāratiki vaṅkalottanēm̐ṭiki

3.Kanduvakum̐ dīsi nannu kām̐gilin̄ci kūḍinaṭṭi-
andālakē tagilēnu appaṭanuṇḍi
pondina śrī vēṅkaṭēśa bhuvi nīkr̥pa nin̄citim̐
vandamāya nājanmamu alayin̄canēm̐ṭiki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.