Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1472 | Keerthana 429 , Volume 24
Pallavi: Amtesidoratanaalayaake Yeepe (అంతేసిదొరతనాలయాకె యీపె)
ARO: Pending
AVA: Pending
Ragam: Mukhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంతేసి దొరతనాల యాకె యీపె
కొంతపుఁజూపులఁ జట్టిగొని నాకె యీపె ॥ పల్లవి ॥
మట్టుమీరి లేకలంపి మాటమాత్రముననే
అట్టె యింటికి రప్పించినాకె యీపె
చుట్టమవలెను నీసొమ్ములెల్లాఁ దనమెడఁ
బెట్టుకొని నిన్ను మెప్పించినయాకె యీపె ॥ అంతే ॥
చెంగటనే సేయరానిచేత సేసి నీవలపు-
లంగడిఁబెట్టినయట్టియాకె యీపె
కొంగువట్టి నీతోను కూరిములు గొసరుచు
అంగవించి చన్నులొత్తినాకె యీపె ॥ అంతే ॥
సెలవుల నవ్వునవ్వి చెక్కులు నొక్కుచు నిన్ను-
నలుకలుదీర్చినయాకె యీపె
అలమేలుమంగను నేననఁగా శ్రీవేంకటేశ
కలసితి విదే నాసంగడియాకె యీపె ॥ అంతే ॥
Pallavi
Antēsi doratanāla yāke yīpe
kontapum̐jūpulam̐ jaṭṭigoni nāke yīpe
Charanams
1.Maṭṭumīri lēkalampi māṭamātramunanē
aṭṭe yiṇṭiki rappin̄cināke yīpe
cuṭṭamavalenu nīsom’mulellām̐ danameḍam̐
beṭṭukoni ninnu meppin̄cinayāke yīpe
2.Ceṅgaṭanē sēyarānicēta sēsi nīvalapu-
laṅgaḍim̐beṭṭinayaṭṭiyāke yīpe
koṅguvaṭṭi nītōnu kūrimulu gosarucu
aṅgavin̄ci cannulottināke yīpe
3.Selavula navvunavvi cekkulu nokkucu ninnu-
nalukaludīrcinayāke yīpe
alamēlumaṅganu nēnanam̐gā śrīvēṅkaṭēśa
kalasiti vidē nāsaṅgaḍiyāke yīpe
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.