Main Menu

Amta Manasuna Gaddu (అంత మనసున గద్దు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 923 | Keerthana 126, Volume 19

Pallavi:Amta Manasuna Gaddu (అంత మనసున గద్దు)
ARO: Pending
AVA: Pending

Ragam:Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత మనసునఁ గద్దు ఆపెకు నీమీఁది బత్తి
సంతోస మప్పటిఁ జేసీ చనవియ్యవయ్యా ॥ పల్లవి ॥

ఘనమైననీదుచక్కనిరూపు చూచిచూచి
తనివి దీర దెంతైనాఁ దరుణికిని
పనివడి నీవలెనే బంగారుపతిమఁ జేసి
వెనుకొ నాపెమోమున వేలఁగట్టవయ్యా  ॥ అంత ॥

సరసములాడి నీతో సారెకు నవ్వులు నవ్వీ
మరిగియున్నది నీ పై మచ్చికలెల్లా
సరుసఁగూచుండి నీవు చవులుగాఁ జెనకుచు
కెరలించి కెరలించి గిలిగించవయ్యా    ॥ అంత ॥

ముట్టి నీపాదము లురమున నిడుక వొత్తుచు
యిట్టె పాయదు శ్రీ వేంకటేశ నిన్నును
నెట్టన నన్నేలితివి నీవింకా సొమ్ములు సేసి
మెట్టి నీపాదుకలాపెమెడఁ గట్టవయ్యా     ॥ అంత ॥

Pallavi

Anta manasunam̐ gaddu āpeku nīmīm̐di batti
santōsa mappaṭim̐ jēsī canaviyyavayyā

Charanams

1.Ghanamainanīducakkanirūpu cūcicūci
tanivi dīra dentainām̐ daruṇikini
panivaḍi nīvalenē baṅgārupatimam̐ jēsi
venuko nāpemōmuna vēlam̐gaṭṭavayyā

2.Sarasamulāḍi nītō sāreku navvulu navvī
marigiyunnadi nī pai maccikalellā
sarusam̐gūcuṇḍi nīvu cavulugām̐ jenakucu
keralin̄ci keralin̄ci giligin̄cavayyā

3.Muṭṭi nīpādamu luramuna niḍuka vottucu
yiṭṭe pāyadu śrī vēṅkaṭēśa ninnunu
neṭṭana nannēlitivi nīviṅkā som’mulu sēsi
meṭṭi nīpādukalāpemeḍam̐ gaṭṭavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.